World AIDS Day to unite in the fight against HIV

World aids day to unite in the fight against hiv

AIDS, World AIDS Day, AIDS Day

World AIDS Day is held on the 1st December each year and is an opportunity for people worldwide to unite in the fight against HIV, show their support for people living with HIV and to commemorate people who have died. World AIDS Day was the first ever global health day, held for the first time in 1988.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నేడు

Posted: 12/01/2015 10:35 AM IST
World aids day to unite in the fight against hiv

విశ్వవ్యాప్తంగా ప్రజలు 1 డిసెంబర్ 2015వ తేదీని, 26వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, హెచ్.ఐ.వి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలను చేపట్టడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు, ఆరోగ్య అధికారులు, ఎన్.జి.ఓ లు మరియు ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని ఈ దినోత్సవ నిర్వహణ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

అవగాహన కోసమే.. ఎయిడ్స్ దినోత్సవం
ఎయిడ్స్ మహమ్మారిని మానవ సమాజం నుంచి పారదోలేందుకు ఏకైక మార్గం... అవగాహన. స్త్రీపురుషుల సంభోగంలో "రక్షణలేని సెక్స్" (సేఫ్టీలెస్ సెక్స్), ఇంజక్షన్ల వల్ల ఈ వ్యాధి సోకుతుందని నిర్థారించారు. అందువల్ల దీన్ని అరికట్టేందుకు ప్రధానంగా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని ఐరాస నిర్ణయించింది. అందుకోసమే డిసెంబరు ఒకటిని "ప్రపంచ ఎయిడ్స్" దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రపంచంలో ఉన్న మారుమూల ప్రాంతం వాసులకు సైతం ఎయిడ్స్ అవగాహన కల్పించాలన్నదే ఈ దినోత్సవ ప్రత్యేకత. గత 1988 సంవత్సరం నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
• ఏటా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని, 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థలో ‘గ్లోబల్ ప్రోగ్రాం ఆన్ ఎయిడ్స్’ యొక్క ప్రజా సమాచార అధికారులైన జేమ్స్ బన్ మరియు థామస్ నేట్టర్ నిర్ణయించారు.
• తొలి ఎయిడ్స్ వ్యాధి కేసును 1981లో అమెరికాలో గుర్తించారు, హెచ్.ఐ.వి వైరస్ వ్యాప్తి వల్ల ఏర్పడే ఈ వ్యాధిని, తొలిసారిగా కొందరు గే లలో కనుగొన్నారు. ఈ వ్యాధి యొక్క వైరస్ పుట్టుకను ఆఫ్రికాలో గుర్తించగా, తొలిసారిగా అమెరికా ఈ వ్యాధి పట్ల విశేషంగా ప్రచారాన్ని చేసింది.
• ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారిని సంస్మరించుకొని, ఈ వ్యాధి నివారణకు ప్రపంచ ప్రజలు నిర్విరామంగా పోరాటం చేయాలని, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు చేయూతను అందించాలని ఈ దినోత్సవం ప్రకటిస్తుంది.
* తొలి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని 1988లో నిర్వహించారు. ఇది ఆరోగ్య రంగానికి సంబంధించిన తొలి ప్రపంచ దినోత్సవం.

ఎయిడ్స్.. ఈ మూడక్షరాల పదం వింటేనే సమస్త మానవాళి మృత్యు భయంతో వణికి పోతుంది. ఈ వ్యాధి సంక్రమిస్తే ఇక శాశ్వతంగా కన్నుమూయాల్సిందేనన్నది వారి భయం. అందుకే ఎయిడ్స్ వ్యాధి గురించి జరిగిన.. జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. అయితే.. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు నిర్థారణ అయిన మరుక్షణం నుంచే సరైన మందులు వాడాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. అలా వాడిన పక్షంలో ఎయిడ్స్ మహమ్మారిని కొంత మేరకు జయించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతమాత్రానా ఈ వ్యాధిని తక్కువ అంచనా వేయవద్దని నిపుణులు ప్రపంచ దేశాలకు హెచ్చరికలూ చేస్తున్నారు. అందుకే డిసెంబరు ఒకటో తేదీని "ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం"గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.


హెచ్‌ఐవీ/ఎయిడ్స్ అంటే...
హెచ్‌ఐవీ అనేది ఓ రకం వైరస్. ఇది క్రమేణా ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి శరీరంలో వ్యాధి నిరోధక కణాలు (సెల్స్) ఉంటాయి. ఇవి ప్రతి లీటరు రక్తంలో 500 నుంచి 1500 వరకు ఉంటాయని వైద్య శాస్త్రం పేర్కొంటుంది. అయితే.. హెచ్‌ఐవీ సోకిన రోగికి వీటి శాతం గణనీయంగా అంటే.. 200 మేరకు తగ్గిపోతాయి. అందువల్ల ఆ రోగి శరీరంలో వ్యాధి నిరోధక శక్త తగ్గిపోవడంతో వైరస్ ఎయిడ్స్ వ్యాధిగా మారుతుంది.

ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది..
*లైంగిక సంపర్కం వలన. ప్రపంచంలోని అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు.
*రక్తం ద్వారా. పచ్చబొట్లు పొడిపించుకోవటం వలన, వ్యాధి గ్రస్తుని రక్తదానం వలన కూడా ఎయిడ్స్ వ్యాపించ వచ్చు. పచ్చబొట్టు వళ్ళ ఎందుకంటే, *వారు ఒకరికి ఉపయోగించిన సూదినే మళ్ళీ ఇంకొకరికి ఉపయోగిస్తారు, అయితే ఇలాంటి కోవాకే చెందిన క్షవరం, సుంతీ, ఇంజెక్షను మొదలగునవి చేయించుకునేటప్పుడు అప్రమత్తతో మెలగాలి
*తల్లి నుండి బిడ్డకు. తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారాలలో ఈ వ్యాధి కోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ చనుబాల వలన కూడా సంక్రమిస్తుంది. సరయిన చికిత్స తీసుకోనప్పుడు ఈ రకమయిన వ్యాప్తికి ఆస్కారం 20% అయితే, సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసి సరయిన చికిత్స ఇవ్వగలిగితే అప్పుడు ఎయిడ్స్ వ్యాప్తిని ఒక్క శాతానికి తగ్గించవచ్చు.

ఎయిడ్స్ ఇలా వ్యాపించదు..
*దోమ కాటు,పిల్లుల కాటు,కుక్క కాటు, దగ్గు, తుమ్ముల వల్ల, ముద్దుల వల్ల
*స్పర్శించటం వలన,హెచ్‍ఐవి/ఎయిడ్స్ సోకిన వ్యక్తిని కౌగలించుకొవడం వలన
*వ్యాధిగ్రస్తుని బట్టలు ధరించటం వలన,ఒకే మరుగు దొడ్లను, ఒకే స్విమ్మింగ్ పూల్‌‌లను ఉపయోగించటం ద్వారా
*ఎయిడ్స్‌గల వారితో కలిసిమెలిసి జీవించడం వల్ల
*ఎయిడ్స్‌పీడితుల సంరక్షణ బాధ్యతవహించేవారికి ఆ కారణంగా ఇది సోకడం జరగదు.
*హెచ్‍ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితో కలసి పనిచేయడం వలన సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎంతమాత్రం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIDS  World AIDS Day  AIDS Day  

Other Articles