Sex drive | Relationships | Dating | britain survey best age to have sex | Britains

Survey shows when brits think best age for sex life is and it s not in your 20s

Sex drive, Relationships, Dating, britain survey reveals sex age, best age to have sex, Britains confess sexual peak later in life, sex life begin at 40, sexual relationships, go off sex, health supplement supplier, Healthspan

Majority of Brits confess to feeling at their sexual peak later in life, saying most people have more experience between the sheets by then

శృంగారాన్ని ఆస్వాదించి, ఆనందింది.. ఆ వయస్కులేనట..!

Posted: 11/21/2015 11:43 AM IST
Survey shows when brits think best age for sex life is and it s not in your 20s

శృంగారానికి సరైన వయసు ఏది? ఏ వయసులో శృంగారం ఆసక్తికరంగా ఉంటుంది. దీనికి చాలామంది అనుకునే సమాధానం యుక్త వయసు అని. అంటే 20 సంవత్సరాల నుంచి 30 వరకు. కానీ అది అబద్ధమని ఇటీవల జరిగిన సర్వేలో తేలింది. శృంగారాన్ని బాగా అస్వాదించేది, ఆనందించేది, ఎంజాయ్‌ చేసేది 40 సంవత్సరాల వయసే సరైనదట. 20, 30 వయస్సులోని వారు ఉద్రేకంతో, ఉత్సాహంతో శృంగారంలోని గమత్తును పోందలేరని సర్వే స్పష్టం చేసింది. అయితే నిజానికి నాలుగు పదులు వయస్సులో వున్న జంటలు, దంపతులు  మాత్రం సెక్స్‌లోని అసలైన మజాను చవిచూస్తారట.

ఇటీవల బ్రిటన్‌లో వృద్ధులపై జరిగిన సర్వేలో ఇది రుజువైందట. ఈ సర్వేలో పురుషులు, మహిళలు కలిపి మొత్తం 828 మంది పాల్గొన్నారు. వారిలో 38 శాతం మహిళలు, 39 శాతం పురుషులు.. సెక్స్‌ను 40 సంవత్సరాల వయసులోనే బాగా ఎంజాయ్‌ చేశామని చెప్పారట. దీనికి కారణం లేకపోలేదు. శృంగారం రెండు శరీరాల మధ్య జరిగేదే అయినా .. అందులో మనసు పాత్ర కూడా చాలా కీలకం. సాధారణంగా యుక్త వయసులో ఉండే ఒత్తిడి, టెన్షన్‌ నాలుగు దశాబ్దాల వయసులో ఉండవట. అందుకే ఆ వయసులో మనసును పూర్తిగా సెక్స్‌పై కేంద్రీకరించవచ్చట. ‘

ఇరవై సంవత్సరాల వయసులో ఎక్కువసార్లు సెక్స్‌ చేయగలగుతాం. కానీ అందులో మొక్కుబడితనం, ఆత్రుతే ఎక్కువగా ఉంటుంది. ముప్పై సంవత్సరాల వయసులో పిల్లలు చిన్న వాళ్లుగా ఉంటారు. ఆ సమయంలో వారి గురించి శ్రద్ధ తీసుకోవాలి. కెరీర్‌ మీద దృష్టి పెట్టాలి. అదే నలభయ్యేళ్లు వచ్చే సరికి పిల్లలు కొంచెం పెద్దవారై ఉంటారు. కెరీర్‌లో కూడా స్థిరపడిపోతాం. కాబట్టి ఆ వయసులో మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సెక్స్‌ను ఎంజాయ్‌ చేయడానికి అదే సరైన వయసు’అని పరిశోదకుడు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sex drive  Relationships  Dating  

Other Articles