మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తకొత్త విధానాలు అమలులోకి వస్తున్నాయి. ముఖ్యంగా.. నేటి ఆధునిక యుగంలో ‘న్యూడిటీ’ ఎక్కువగా నడుస్తుండటంతో.. దానిని క్యాష్ చేసుకునేందుకు కొన్ని సంస్థలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ నేపథంల్యో తాజాగా ఓ సోషల్ మీడియా కంపెనీ ఓ వింత ప్రకటన జారీ చేసింది. ‘‘ఆ’ రివ్యూ రైటర్ గా జాబ్ చేసే దమ్ముందా..? అయితే వెంటనే అప్లై చేసుకోండి’’ అంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకీ ఆ జాబ్ ఏంటో తెలుసా..? ‘ప్రాస్టిట్యూట్ టెస్టర్’. అంటే వ్యభిచారిణుల వద్దకు వెళ్లి వారి పనితనం చూసి వారికి రేటింగ్ ఇవ్వడం. అంతేకాదు.. సినిమా రివ్యూ రాసినట్టు వారి గురించి రాసి వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలి. ఇది ఆ వింత జాబ్.
జర్మనీకి చెందిన కౌఫ్‌మిచ్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్ ఈ వెరైటీ ప్రకటన చేసి.. సరికొత్త సంచలనానికి నాంది పలికింది. ఈ జాబ్‌కు మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా అర్హులే. నిజానికి.. జర్మనీలో వ్యభిచారం చట్టపరమైంది కాబట్టి.. అక్కడ అక్కడ మేల్, ఫిమేల్ ప్రాస్టిట్యూట్‌లకు మంచి గిరాకి. అందుకే అక్కడి అడల్ట్ ఇండస్ట్రీ గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడానికి సదరు వెబ్‌సైట్ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సైట్ ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టింది. ఇక ఈ ఉద్యోగానికి సెలక్స్ అయినవారు ఈ ఉద్యోగంలో భాగంగా ఏం చేయాలంటే... మొదట వారు ప్రాస్టిట్యూట్స్ వద్దకు వెళ్లి.. వారి సర్వీస్, శుభ్రత, ఆరోగ్యం గురించి లోతుగా వివరాలు సేకరించి రిపోర్ట్ చేయాలి. అంతేకాదు... సెక్స్ వర్కర్స్ నైపుణ్యం తెలుసుకునేందుకు వారితో సెక్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి అని సదరు కంపెనీ కండీషన్ పెట్టింది కూడా. అలా వ్యక్తిగతంగా శృంగారంలో పాల్గొంటేనే సెక్స్ వర్కర్ల నైపుణ్యాన్ని బాగా అర్థం చేసుకోవచ్చన్న భావనతో కంపెనీ ఆ రూల్ పెట్టింది. వీటిని బట్టి ఉద్యోగస్తులు రివ్యూ రాసి, రేటింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఏయే అర్హతలు వుండాలంటే.. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం డిగ్రీ చేసుండాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. అలాగే జర్మన్‌తోపాటు ఫ్రెంచ్ భాష్ కూడా తెలిసుండాలాట. ‘జర్మనీలోని సెక్స్ ఇండస్ట్రీకి కూడా ఇతర రంగాలతో సమానంగా గుర్తింపు తీసుకురావడమే మా లక్ష్యం. వారి గురించిన సంపూర్ణ సమాచారం మా వెబ్‌సైట్లో దొరుకుతుంది. అందుకే ఈ జాబ్ ప్రకటన చేశాం. ఈ జాబ్ ప్రకటనకు స్పందన బావుంది. ఇప్పటికే 156 అప్లికేషన్‌లు వచ్చాయి. జర్మనీ నుంచే కాకుండా బెల్జియం, నెదర్లాండ్స్, బ్రిటన్ నుంచి కూడా చాలామంది అప్లయ్ చేశార’ని కౌఫ్‌మిచ్ డాట్‌కామ్ అధినేత బెన్ వెల్లడించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more