caught on cctv: security guard of a jamshedpur hotel assaulted by a drunk girl

Cctv captures drunk youth beating up security guard in jamshedpur

CCTV, Jamshedpur, hotel, women, attack, security guards, security beaten up by drunk youth, CCTV Captures Drunk Youth ruckus, drunk girl assults security guard, viral video, viral on social media

A drunk youth in Jamshedpur beat up a security guard outside a hotel. The incident was caught on a nearby CCTV

ITEMVIDEOS: యువజంట రభస: మద్యం మత్తులో సెక్యూరిటీని...

Posted: 11/20/2015 09:06 PM IST
Cctv captures drunk youth beating up security guard in jamshedpur

తప్ప తాగితే ఎవరో ఏమిటో కానరాదని అంటారు. ఏం చేస్తున్నామో.. ఎలా ప్రవర్తిస్తున్నామనే కనీస సోయి ఉండదని చెప్తుంటారు. అంతేకాదు పుల్ గా తాగిన వాడికి పాత పగలు, పాత కక్షలు గుర్తుకు రావడమే కాదు.. ఉన్నఫలంగా వారి ఎదుటికి వెళ్లి వారిపై దాడులకు కూడా తెగబడుతుంటారట. ఈ వీడియో చూస్తే తాగినోళ్లు గురించి తాగునోళ్లో, తాగనోళ్లో చెప్పింది అంతా నిజమే అనిపిస్తుంది. ఎందుకని ప్రశ్నిస్తున్నారా..? పుల్ గా మద్యం సేవించిన ఓ యువ జంట చేసిన ఆగడం అంతా ఇంతా కాదు.. ఏదో జరిగిందని సర్థిచెబుదామనుకున్న వారు కూడా కిమ్మనకుండా ఘటనాస్థలం నుంచి జారుకున్నారంటే.. ఆ యువజంట ఎంత రభస చేసిందో మరి..

జంషెడ్ పూర్లో ఫుల్లుగా తాగిన అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఓ హోటల్ వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారు ఎంత వారిస్తున్నా వినకుండా పిడిగుద్దులతో, కాలితన్నులతో చుట్టుపక్కలవారిని అవాక్కయ్యేలా చేసింది. ఆమెకు తన బాయ్ ఫ్రెండ్ కూడా తోడై అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నవారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో కళ్లొప్పగించి చూడటం అక్కడి చుట్టుపక్కల ఉన్నవారి, రహదారిపై వాహనాల్లో వెళ్లేవారి వంతయింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CCTV  Jamshedpur  hotel  women  attack  security guards  

Other Articles