Nitish Kumar takes oath as Bihar CM, Lalu's sons join Bihar Cabinet

Nitish sworn in as bihar cm lalu s sons join his cabinet

bihar, Nitish kumar, nitish kumar swearing in, nitish kumar bihar cm, nitish swearing in, live nitish kumar, nitish kumar news, Bihar cabinet, Tejaswi Prasad Yadav, Tej Pratap

Nitish Kumar on Friday took oath as Bihar Chief Minister along with 28 ministers, including RJD chief Lalu Prasad’s two sons Tejaswi and Tej Pratap

బిహార్ సీఎంగా నితీష్ ప్రమాణం.. క్యాబినెట్ లోకి లాలు తనయులు సహా 28 మంది

Posted: 11/20/2015 04:24 PM IST
Nitish sworn in as bihar cm lalu s sons join his cabinet

బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాథ్ కోవింద్.. నితీశ్తో ప్రమాణం చేయించారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేయడమిది ఐదోసారి. నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు పలువురు అతిరథ మహారథులు హాజరుకాగా, దాదాపు 2 లక్షల మంది ప్రజలు విచ్చేశారు. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల  ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.



బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు మంత్రి పదవులు దక్కాయి. శుక్రవారం మధ్యాహ్నం బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లాలు తనయులు తేజస్వి , తేజ్ ప్రతాప్ ప్రమాణం చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాథ్ కోవింద్ వీరితో ప్రమాణం చేయించారు. లాలు చిన్న కొడుకు తేజస్వి (26)కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో లాలు ప్రసాద్ దూరంగా ఉండగా, ఆయన తనయులు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా ఇద్దరు తొలిసారి మంత్రులుగా బాధ్యతుల చేపట్టనున్నారు. మరి వారెలా రాణిస్తారో.. బీహర్ ప్రజల్ల మనన్నలు ఎలా సాధిస్తారో వేచి చూడాలి మరి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar  Nitish kumar  Bihar cabinet  Tejaswi Prasad Yadav  Tej Pratap  

Other Articles