Mali Attack: 3 Killed as Gunmen Take 170 Hostage in Bamako Hotel, 20 Indians Among Guests

Mali hotel attack scores of hostages held in bamako

paris attack, Mali, Radisson Blu Hotel, terrorist, Bamako, Radisson Blu hotel,Malian capital Bamako,Automatic weapons fire,Sevare,UN workers,former Tuareg rebels,Shooting in Radisson Blu Hotel

Gunmen went on a shooting rampage at the luxury Radisson Blu hotel in Mali's capital Bamako today, seizing 170 guests and staff in an ongoing hostage-taking, the hotel chain said.

ITEMVIDEOS: మాలీలో ఉగ్రదాడులు.. 20 మంది భారతీయులు సహా 170 మంది బంధీలు..

Posted: 11/20/2015 04:56 PM IST
Mali hotel attack scores of hostages held in bamako

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మతం చందాసవాదం ముసుగులో పారిస్‌పై సాగించిన మారణకాండ విషాధఛాయలను మరువకముందే పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలోనూ అదే తరహాలో బరితెగించారు. మాలి రాజధాని బమాకోలో ముంబాయ్, పారిస్ తరహా దాడులకు ఒడిగట్టారు. బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌పై 10మంది ఆగంతకులు విరుచుకుపడ్డారు. హోటల్‌లో ఉన్న170 మందిని బందీలుగా చేసుకున్నారు. బంధీలలో సుమారు 20 మంది వరకు భారతీయులు వున్నారని, వారందరూ క్షేమంగానే వున్నారని మాలీ ప్రభుత్వం ప్రకటించింది. వీరితో పాటు బందీల్లో ఎక్కువ మంది  అమెరికా, బ్రిటిష్ టూరిస్టులే వున్నారు.

ఉగ్రవాదుల చెరలో 170మంది ఉండగా, వారిలో 140మంది పర్యాటకులు కాగా, 30 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. మరోవైపు భద్రతాదళాలు హోటలును చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థులు ఉన్నట్లు సమాచారం.  కాగా గత ఆగస్టులోనూ మాలిలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడి తొమ్మిది మందిని బలితీసుకున్నారు. సరిగ్గా భారత్ లోని ముంబై దాడులను తలపించేలా బాలిలో స్కెచ్ వేశారు ఉగ్రవాదులు. ముంబాయిలోని తాజ్ హోటల్ లో పర్యాటకులను బందీలుగా చేసుకుని జరిపిన మారణ హోమం తరహాలోనే మాలిలో పర్యాటకులను బందీలుగా చేసుకున్నారు. వీరిని బంధవిముక్తుల్ని చేసి సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు మాలీలోని రక్షణ దళాలు రంగంలోకి దిగాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris attack  Mali  Radisson Blu Hotel  terrorist  Bamako  

Other Articles