Paris attacks footage shows a woman easily escape terrorist after gun jams in cafe | paris attacks updates

A woman luckily escaped from terrorist after gun jams in cafe paris attacks controversy

paris attacks, woman escape from terrorist in paris attack, woman escaped terrorist after gun jams, paris attacks news, paris attacks controversies, terrorist gun jams

A woman luckily escaped from terrorist after gun jams in cafe paris attacks controversy : Horrifying footage from the Paris attacks has emerged which shows a woman escaping with her life due to a gun jam.

ITEMVIDEOS: AK47 ఎక్కుపెట్టినా.. ఆ మహిళ బతికిపోయింది!

Posted: 11/20/2015 04:19 PM IST
A woman luckily escaped from terrorist after gun jams in cafe paris attacks controversy

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నవంబర్ 13వ తేదీ జరిగిన మారణహోమంలో ఎంతోమంది బలయ్యారు. అప్పటివరకు ప్రశాంతంగా వున్న ఆ వాతావరణం ఉగ్రవాదుల దాడితో అట్టుడికిపోయింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆ రోజంతా కాల్పులు జరిపి 129మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. అయితే.. అదే సమయంలో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు వెలుగుచూశాయి. ఓ ఉగ్రవాదికి కేవలం 3 అడుగుల దూరంలో వున్న ఓ వ్యక్తి అదృష్టవశాత్తూ అతని కంటపడకుండా తప్పించుకుని ప్రాణాలతో బయటపడపడ్డాడు. ఇక ఈ తరహాలోనే ఓ మహిళ కూడా ప్రాణాలతో బయటపడింది. ఓ కేఫ్ లో దాగివున్న మహిళను గమనించిన ఓ ఉగ్రవాది.. ఆమెపై AK47 ఎక్కుపెట్టినా అది పేలలేదు. దీంతో ఆమె అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణాలు కాపాడుకుంది.

ఓ కేఫ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయినదాని ప్రకారం.. ఓ మహిళ ఓ ఉగ్రవాది బారి నుంచి ఎంతో చాకచక్యంగా బయటపడింది. తొలుత ఆ కేఫ్ పై ఓ ఉగ్రవాది ఎంతో వేగంగా కాల్పులు జరిపాడు. అందులో వున్నవారిని చంపుకుంటూ దూసుకెళ్ళాడు. అతని దాడిలో ఎంతోమంది చనిపోగా.. మరికొందరు బయటికి పరుగులు తీశారు. అయితే.. ఓ మహిళ మాత్రం ఆ గుంపులో పరుగెత్తలేక.. అక్కడే ఓ ప్రదేశంలో దాక్కుంది. ఆ ఉగ్రవాది తాను రెండడుగులు వేస్తే దొరికిపోయేంత దూరంలో ఓ మహిళ ఉండటం గమనించి ఆమె దగ్గరికి వాయువేగంతో వెళ్లాడు. తన చేతిలోని ఏకే 47 గన్ ను ఆ మహిళ తలకు పాయింట్ బ్లాండ్ లో గురిపెట్టాడు. కానీ ట్రిగ్గర్ నొక్కినా అది పేలలేదు. అది స్ట్రక్ అయిపోవడంతో అతడు రెండు మూడు సెకన్లు మాత్రమే మరోసారి నొక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతబట్టుకొని అక్కడి నుంచి పారిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman escape from terrorist gun jams  paris attacks  

Other Articles