Nitesh Kumar will take oath as Bihar cm Today

Nitesh kumar will take oath as bihar cm today

Nitesh Kumar, Nitesh Kumar as Bihar CM, Bihar, Bihar CM, Bihar polls, Bihar Elections, Nitesh Kumar Oath

Nitesh Kumar after extraordinary win in Bihar elections, today he is taking oath as Bihars Chief minister. patna will host the Nitesh Kumars oath ceremony

బీహార్ సిఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం నేడు

Posted: 11/20/2015 03:57 PM IST
Nitesh kumar will take oath as bihar cm today

బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల అతిరథ మహారధులంతా ఈ వేడుకకు హాజరు కానుండటంతో రానున్న అన్ని రాష్ట్రాల ఎన్నికల సమీకరణలకు నితీశ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదిక కానుంది. బీహార్ సిఎంగా నితీష్ కుమార్ నేడు ఐదోసారి ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నేటి మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ వేడుకకు ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జునఖర్గె, గులాంనబీ ఆజాద్ లు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ గౌరవాధ్యక్షుడు ఫరూఖ్‌అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా హాజరు కానున్నారు.

కాగా ఎన్నికల ప్రచారంలో నితీశ్ - లాలూ బంధానికి వ్యతిరేకంగా దూకుడుగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోదీని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని సీఎం కోరారు. కానీ తన తరఫున కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, రాజీవ్‌ప్రతాప్‌రూడీలను పంపనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల్లో జేడీయూ - ఆర్జేడీ - కాంగ్రెస్ పార్టీల నేతృత్వంలోని మహా కూటమి ఘన విజయానికి కారణమైన ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ పక్కపక్కనే ఆసీనులు కానున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్‌యాదవ్, సిక్కిం సీఎం పీకే చాంబ్లింగ్‌తోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సీఎంలు వీరభద్రసింగ్ (హిమాచల్‌ప్రదేశ్), సిద్దరామయ్య (కర్ణాటక), తరుణ్‌గొగోయ్ (అసోం), ఇబోబిసింగ్ (మణిపూర్), నబాం తుకి (అరుణాచల్‌ప్రదేశ్) హాజరు కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles