Blindfolded Muslim Asks Parisians To Hug Him If They Trust Him. Many Do.

Hug me if you trust me says muslim man in paris

Terrorism, Religion, Paris, paris attack, ‬Muslims Are Not Terrorists‬, Paris Attacks‬, islam, parisians, Blindfold, Islam, Muslim, Paris, France, Paris attacks, hugs, hugging,, Blindfold, Muslim man, Parisians, Hug, Trust

What happens when a Muslim man stands at a public square in Paris, mere days after terrorist attacks that killed over 100 people? People hug him.

ITEMVIDEOS: ‘‘ఆ ముస్లింను పారిస్ గుండెలకు హత్తుకుంది’’

Posted: 11/19/2015 08:44 PM IST
Hug me if you trust me says muslim man in paris

అతనో మహ్మదీయుడు. అతను పారిస్ లోని పబ్లిక్ స్వ్కేర్ వద్ద నిల్చుని చేతులు చాచి.. తనను కౌగలించుకోవాలంటే.. ఏమవుతుంది. అదే సాదారణ పరిస్థితులు నెలకోన్న సమయంలో అతన్ని అందరూ హత్తుకుంటారు. కానీ మతం మాటున చంధాసవాదం నరనరాన నింపుకున్న ఉగ్రవాదులు జరిపిన దారుణ మారణకాండ నేపథ్యంలో ఎవరైనా ఏం చేస్తారు..? ఎవరు ఆ వ్యక్తిని హత్తుకునే సాహసం చేస్తారు. అయినా పారిస్ అతన్ని హత్తుకుంది. మామూలుగా కాదు తమ గుండెలకు హత్తుకుంది. ఉగ్రవాదలు సృష్టించిన మారణ మృదంగంలో నీ పాత్ర లేదని చాటి చెప్పింది. ఇది ఎక్కడ ఎలా జరిగిందంటే..

‘‘నేనో ముస్లింను. నేను ఉగ్రవాదిని అని చెబుతున్నారు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు కూడా నన్ను నమ్మితే వచ్చి హత్తుకోండి’’ అని కళ్లకు గంతలతో రెండు బోర్డులు పట్టుకుని నిల్చున్న వ్యక్తిని చూసి పారిస్ ప్రజల హృదయాలు చలించిపోయాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి హత్తుకున్నారు. రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన పారిస్‌లోని డి లా రిపబ్లిక్ వద్ద దీనంగా నిల్చున్న ఈ వ్యక్తిని చూసి పారిస్ వాసులు కంటతడి పెట్టారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో సందడి చేస్తున్న ఈ క్లిప్లింగ్‌ను ఇప్పటికే వేలాదిమంది చూశారు.

తనను హత్తుకుంటున్నప్రతి ఒక్కరికీ పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యక్తి కృతజ్ఞతలు చెబుతున్నాడు. ‘‘నేను ముస్లింనే. అంతమాత్రాన నేను ఉగ్రవాదిని కాను. నేనెప్పుడూ ఎవరినీ చంపలేదు. గత శుక్రవారం నా పుట్టిన రోజు. కానీ దానిని జరుపుకునేందుకు బయటకు వెళ్లలేదు’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘ముస్లిం అయినంత మాత్రాన తప్పకుండా ఉగ్రవాది అవుతాడని అనుకోవద్దని ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. మనుషులను చంపాలని ముస్లిం మతమే కాదు.. ఏ మతమూ చెప్పదు’’ అని ఆర్థ్రత నిండిన కళ్లతో చెప్పాడు. ఆలస్యమెందుకు ఈ వీడియోనూ మీరు చూడండీ..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Blindfold  Muslim man  Parisians  Hug  Trust  

Other Articles