Sons are Duty-Bound to Look After Mother, Says Madras High Court

Madras hc says hindu christian couple s marriage is invalid

Madras high court, marriage personal law, Hindu Marriage Act, Special Marriage Act, hindu christian marriage, conversion, special marriage act, hindu marriage, marriage law, marriage madras high court, christian marriage, marriage customs, nation news, india news

The Madras high court said on Thursday the marriage of a Hindu woman and a Christian man is not legally valid if either of them does not convert.

మతాంతర వివాహంపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..!

Posted: 11/19/2015 08:47 PM IST
Madras hc says hindu christian couple s marriage is invalid

మతాంతర వివాహంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇద్దరిలో ఏ ఒక్కరు మతం మారకపోయినా ఆ పెళ్లి చెల్లదని పేర్కొంది. క్రైస్తవ మతానికి చెందిన ఓ వ్యక్తి, హిందూ మతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీన్ని వ్యతిరేకించిన ఆమె తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చారు. వారి పెళ్లి ఎలా జరిగిందని ద్విసభ్య ధర్మాసనం ఆమెను ప్రశ్నించింది.

హిందూ సంప్రదాయం ప్రకారం గుడిలో పెళ్లి చేసుకున్నట్లు ఆ అమ్మాయి చెప్పింది. క్రిస్టియన్ వ్యక్తి హిందూ మతం స్వీకరించకపోతే ఈ పెళ్లి చెల్లదని హైకోర్టు పేర్కొంది. ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా తమ మతం మారకపోతే మరో మతాచారం ప్రకారం వారి పెళ్లి చెల్లదని పిటీషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఆర్. శివకుమార్, జస్టిస్ వి.ఎస్.రవిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది

ఒక వేళ ఎవరి మతాలు వారు కొనసాగించాలనుకుంటే 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. అయితే తాను మేజర్‌నని, పెళ్లి చేసుకున్న వ్యక్తితోనే కలిసి ఉంటానని ఆ అమ్మాయి కోర్టుకు చెప్పింది. దీంతో మేజర్ అయిన ఆమెకు స్వేచ్ఛగా ఎక్కడైనా ఉండే హక్కు ఉందన్న మద్రాస్ హైకోర్టు, ఆమె తల్లిదండ్రులు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madras high court  marriage personal law  Hindu Marriage Act  Special Marriage Act  

Other Articles