అమెరికా అందాల బామ, ఏంజెలినా జోలీ.. హాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. తన అందంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి నిద్ర లేకుండా చేస్తున్న నీలి కళ్ల సుందరి. నలభై సంవత్సరాలు నిండుతున్నా వన్నే తగ్గని అందంతో మెరుస్తున్న ఈ బ్యూటీ ఇటీవలె తన తల్లి నుంచి వారసత్వంగా సంక్రమించిన బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. దాని నుంచి సురక్షితంగా బయటపడి మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించింది. స్వీయ దర్శకత్వంలో భర్త బ్రాడ్ పిట్‌తో కలిసి జోలీ నటించిన చిత్రం ‘బై ద సీ’. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కథానుసారం చాలా హాట్ సీన్లు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఓ సీన్ విషయంలో మాత్రం జోలీ తెగ ఫీలైపోతోందట.
ఈ సినిమాలో జోలీ ఓ న్యూడ్ బాత్ సీన్ చేసిందట. పూర్తి నగ్నంగా ఆ సీన్‌లో కనిపించనుందట ఈ సుందరి. అయితే గతంలో జోలీ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సమయంలో డాక్టర్లు ఆమె రెండు వక్షోజాలనూ తొలగించారట. దాంతో వక్షోజాలకు సంబంధించిన షాట్‌ను మరో మహిళపై తీశారట. అయితే ఇప్పుడు ఆ సీన్‌ను తొలగించాలని జోలీ అనుకుంటోందట. దానికి కారణమేంటంటే తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన సంగతి ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తెలుసని, చికిత్సలో భాగంగా వక్షోజాలను తొలగిస్తారన్న సంగతి కూడా అందరికీ తెలుసని, కావున ఆ సీన్ చూసిన వారు నేను మోసం చేశానని భావిస్తారని జోలీ అనుమానపడుతోందట. దీంతో ఏది ఏమైనా ఈ సీన్‌కు కట్ చెప్పడానికే నిర్ణయించుకుందట ఈ ‘సార్ట్’ సుందరి. మరి ప్రేక్షకులు అదరిస్తారో లేదో వేచి చూడాలి మరి
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more