3 persons, including Hindu Mahasabha leader, arrested for misbehaviour with Indigo cabin crew

Three persons arrested for misbehaviour with indigo cabin crew

Indecent behavior, chennai airport, indigo flight, three arrest, Crimes against women, Harassment on indigo airflight, Hindu Mahasabha leader, IndiGo, Tamil Nadu

Three persons were arrested on a passenger flight after they allegedly misbehaved with cabin crew on a flight between Coimbatore and Chennai

విమానంలో అసభ్య ప్రవర్తన.. ఎయిర్ హాస్టస్ ఫోటోలు తీసి..

Posted: 11/19/2015 04:45 PM IST
Three persons arrested for misbehaviour with indigo cabin crew

విమానయానం చేయాలంటే కొంత సంపన్నులై వుంటారు. వీరు ప్రయాణించే విమానాల్లో సభ్యతో మెలుగుతారు. అనుకోకుండా మధ్యంతర సిరి వచ్చో.. లేక సభ్యతా, సంస్కారం మరచిన కుటుంబాలకు చెందిన యువకులు మాత్రం తాము ఎక్కడున్నామన్న విషయాన్ని మరచి.. తమ సంపద ముందు అందరూ దిగదుడుపే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన ముగ్గురు ప్రయాణికులు విమానంలో అసభ్యంగా ప్రవర్తించి.. పోలీసులకు చిక్కారు.

కోయంబత్తూరు- చెన్నై ఇండిగో  విమానంలో ఫుల్లుగా  మద్యం సేవించి ఉన్న ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్, తోటి మహిళా ప్రయాణికుల పట్ల  అమర్యాదకరంగా ప్రవర్తించారు. విచక్షణ మర్చిపోయి ప్రవర్తించారు. తమ సెల్ ఫోన్లలో ఎయిర్  హోస్టెస్ ఫోటో తీయడానికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న మిగతా సిబ్బందితో గొడవకు దిగారు.  దీంతో విమాన సిబ్బంది పైలట్ కు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరు హిందూ మహాసభ నేత కాగా మరో ఇద్దరు న్యాయవాదులు కావటం శోచనీయం.  దీంతో విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా, వారికి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indecent behavior  chennai airport  indigo flight  three arrest  

Other Articles