In the police shootout the mastermind Abdel-Hamid Abu Oud died | paris terror attack news | Abdel-Hamid Abu Oud crime news

Paris terror attack master mind abdel hamid abu oud died in police shootout

Abdel-Hamid Abu Oud, paris terror attack, paris police shootout, isis controversies, isis blasts, Abdel-Hamid Abu Oud photos

paris terror attack master mind Abdel-Hamid Abu Oud died in police shootout : In the police shootout the mastermind Abdel-Hamid Abu Oud died.

ప్యారిస్ దాడుల సూత్రధారి చచ్చాడా? పారిపోయాడా?

Posted: 11/19/2015 10:23 AM IST
Paris terror attack master mind abdel hamid abu oud died in police shootout

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఇటీవల జరిగిన మారణహోమానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది అబ్దెల్ హమీద అబ్-ఔద్ (27) ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్యారిస్ లో ఉగ్రవాదులు దాడులు జరిపిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ సమయంలో కొందరిని హతమార్చారు. అనంతరం వేగంగా విచారణ జరిపి.. ఈ దాడుల సూత్రధారి ఎవరో ఆరాతీయగా అందుకు అబ్దుల్ హమీద్ అబౌద్ అని తేలింది. దీంతో అతనిని పట్టుకునేందుకు సెయింట్ డెనిస్‌లో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ఉగ్రవాది దాగివున్న అపార్ట్ మెంట్ చుట్టూ పోలీసులు మాటువేసి కాల్పులు ప్రారంభించిన నేపథ్యంలో.. అతగాడు తన ఫ్లాట్ లోనే ఆత్మహత్య చేసుకుని వుంటాడని ప్రాథమికంగా కథనాలు వచ్చాయి. అయితే.. దాదాపు 7 గంటల షూటౌట్ అనంతరం అతడు చనిపోయాడా? లేదా? అన్నది పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.

మరోవైపు.. పోలీసులు నిర్వహించిన కాల్పుల నేపథ్యంలో ఆ ఉగ్రవాది భయపడి.. తనను తాను కాల్చుకొని చనిపోయినట్టు భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ రీచీర్ అనధికారికంగా పేర్కొన్నారు. అయితే.. పోలీసుల షూటౌట్‌లో అబ్దుల్ హమీద్ చనిపోయాడని, ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు చేయనున్నారని అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. సెయింట్ డెనిస్‌లో బుధవారం భారీ ఎత్తున జరిగిన ఈ షూటౌట్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. ఏడుగురిని అరెస్టు చేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. చనిపోయిన వారిలో ఓ మహిళ ఉగ్రవాది కూడా వుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆమె తనను తాను పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి బాంబర్ అయిన ఆమె.. అబ్దుల్ హమీద్ భార్య అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. మీడియా కథనాలు అబ్దుల్ హమీద్ చనిపోయినట్లు వార్తలు రాస్తున్నప్పటికీ.. ఆ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.

ఆ ఉగ్రవాది చచ్చాడో బ్రతికాడో ఇంకా స్పష్టం కావడం లేదు. అతనిని టార్గెట్ చేస్తూ జరిగిన ఆపరేషన్‌లో.. మాస్టర్‌మైండ్ ఆనవాళ్లు చిక్కలేదు. అయితే అతన్ని వేటాడేందుకు పోలీస్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు అపార్ట్‌మెంట్‌లో ఓ గోడను కూల్చేశారు. ఆ శిథిలాల కింద కొన్ని శరీర అవయవాలను పోలీసులు కనుకొన్నారు. ఆ శరీరా భాగాలపై ఇప్పుడు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాది అబావూద్ చనిపోయాడా లేక తప్పించుకున్నాడా తెలియాలంటే ఇప్పుడు డీఎన్‌ఏ పరీక్షలే ఆధారం. ఆ శరీర భాగాలు ఉగ్రవాది అబావూద్‌యే అయి ఉంటాయని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఫ్రెంచ్ పోలీసులు తమ ఆపరేషన్‌లో విజయం సాధించినట్టే. కానీ పోలీస్ ఆపరేషన్‌లో ఉగ్రవాది అబాబూద్ కానీ మరో అనుమానితుడు సలాహ్ అబ్దస్లామ్ ఆచూకీ చిక్కలేదు. దాంతో ఫ్రెంచ్ పోలీసులు అయోమయ స్థితిలో ఉన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abdel-Hamid Abu Oud  paris terror attack  isis  

Other Articles