Election commission issued notices to Telangana CS

Election commission issued notices to telangana cs

Warangal, Elections, KCR, Election commission, Notices, Elections commission Notices to KCR, Telangana, Warangal Elections

Elections commission issued notices to Telangana chief secretry on violation of election code in Warangal elections. Telangana cm KCR giving some promises to influence the voters

కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన..? నోటీసులు జారీ

Posted: 11/19/2015 09:48 AM IST
Election commission issued notices to telangana cs

వరంగల్‌ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను కోరామని, ఇందుకు నోటీసులను జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ప్రభుత్వ వివరణ నివేదికను అందించాలని కోరినట్లు ఆయన తెలిపారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్‌ ఉప ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఆయన మీడియాకు వివరించారు. వరంగల్‌ ఉప ఎన్నికల నోటిఫిికేషన్‌ తర్వాత ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన హామీలపై పలువురు కేందద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు.

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన హామీలలో ప్రధానంగా క్రిస్‌మస్‌ ను రాష్ట్ర పండుగగా జరపాలని తీసుకున్న నిర్ణయంతోపాటు అన్ని కాలేజీ హాస్టళ్లకు సన్న బియ్యం పథకాన్ని విస్తరించడం, ఓయూ విద్యార్ధుల మెస్‌ ఛార్జీల విడుదల, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు పోటీ పరీక్షలకు కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటు, కళ్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింపజేసేలా తీ'సుకున్న నిర్ణయం, కాలోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌ నియామకం వంటి ఫిర్యాదులు అందినట్లు ఆయన ప్రకటించారు. కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వ నివేదిక కోరామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సీఎస్‌ రాజీవ్‌ శర్మకు నోటీసులు జారీ చేసి వివరణ కోరామని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles