Petrol price hiked by 36 paise a litre and diesel by 87 paise

Petrol price hiked by 36 paise a litre and diesel by 87 paise

petorl, Diesel. petrol price, diesel prices, Indian petro corporation, Modi, dollar, Rupee value

State-run Indian Oil Corporation announced a hike in the price of petrol by 36 paise a litre and of diesel by 87 paise at Delhi, effective midnight. With this hike, petrol in Delhi will now cost Rs. 61.06/litre, while diesel will come at Rs. 46.80/litre. The petrol and diesel rates shall experience a corresponding increase in other states, the announcement said.

స్వల్సంగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు

Posted: 11/16/2015 08:19 AM IST
Petrol price hiked by 36 paise a litre and diesel by 87 paise

వాహనాదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. పెట్రో ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచుతున్నట్లు కంపెనీలు తెలిపాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. గడిచిన ఐదు నెలల్లో పెట్రోల్ ధరలను పెంచడం ఇదే మొదటిసారి. అయితే అక్టోబర్ నుంచి డీజిల్ రేట్లు పెరగడం ఇది మూడోసారి. తాజా పెంపుతో ఢిల్లీ మార్కెట్లో లీటరు పెట్రోల్ ధర 60.70 రూపాయలు నుంచి 61.06రూపాయలకు చేరుకోగా.. డీజిల్ 45.93రూపాయలు నుంచి 46.80రూపాయలకి పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు, డాలర్-రూపాయి మారకం రేటు ఆధారంగా దేశీయంగా రేట్లను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీ) వెల్లడించింది. ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులను బట్టి ఆయా నగరాల్లో రేటు పెంపు మారుతుంటుంది. హైదరాబాద్ మార్కెట్లో లీటర్ పెట్రోల్‌పై 31పైసలు పెరగగా, డీజిల్‌పై 95 పైసలు పెరిగింది.

దీంతో లీటరు పెట్రోల్ ధర 65.76రూపాయల నుంచి 66.07రూపాయలకు పెరగగా.. డీజిల్ 50.06రూపాయల నుంచి 51.01రూపాయలుకి చేరింది. చివరిసారి జూలై 16న పెట్రోల్ ధర 32 పైసలు పెరిగింది. ఆ తర్వాత నుంచి ధరలు నాలుగు సార్లు తగ్గాయి. ఈనెల మొదట్లో జరిగిన సమీక్షలో పెట్రోల్, డీజిల్ రేట్లను యథాతథంగా ఉంచారు. అక్టోబర్‌లో డీజిల్ ధర రెండుసార్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, డాలర్-రూపాయి మారకం హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ప్రతినెలా 1, 16 తేదీల్లో ఇంధన రేట్లను సవరిస్తుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petorl  Diesel. petrol price  diesel prices  Indian petro corporation  Modi  dollar  Rupee value  

Other Articles