Declare war on ISIS

Declare war on isis

ISIS, War on ISIS, Paris, G-20, Obama, France, Terrorism, ISIS terrorists

Republican presidential candidate Jeb Bush on Sunday joined a growing chorus calling for the United States to more aggressively confront the Islamic State in Iraq and Syria (ISIS) instead of merely containing the extremist group. “We should declare war and harness all of the power the U.S. can bring to bear, both diplomatic and military, of course, to be able to take out ISIS,” the former Florida governor said on NBC’s “Meet the Press.”

ఉగ్రవాదానికి జి-20 దేశాల చరమగీతం

Posted: 11/16/2015 08:21 AM IST
Declare war on isis

ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ఉగ్రవాదం, అతివాదంపై అంతర్జాతీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద భూతంపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. జీ-20 శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకొని నేతలంతా ఒక్కటయ్యారు. పారిస్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడంలోనూ, ఐసిస్‌ ఉగ్రవాద సంస్థను పూర్తిగా తుదముట్టించే చర్యలను రెండింతలు చేయడంలోనూ ఫ్రాన్సుకు వెన్నంటి ఉంటామని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హామీ ఇచ్చారు.రెండు రోజుల జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తున్న టర్కీ దేశాధ్యక్షుడు రెసెప్‌ టయ్యిప్‌ ఎర్గొడాన్‌తో ఒబామా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫ్రాన్సుకు సంఘీభావం తెలపడానికి ఉభయులం అంగీకరించినట్టు ఆయన చెప్పారు.

''వక్రమార్గం పట్టిన సైద్ధాంతిక భావజాలానికి అమాయకులు బలిపెట్టడం అనేది కేవలం ఫ్రాన్సుపైనో టర్కీపైనో జరిగిన దాడి కాదు. అది నాగరిక ప్రపంచంపై జరిగిన దాడి'' అని ఒబామా వ్యాఖ్యానిం చారు. జీ-20 దేశాధినేతల సదస్సు ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక చేస్తుందని ఎర్గొడాన్‌ అన్నారు. ''అంతర్జాతీయ ఉగ్రవాదం పట్ల మా వైఖరి.. సదస్సులో అతి దృఢమైన, తీవ్రమైన సందేశం రూపంలో వ్యక్తీకరించ బడుతుం దని విశ్వసిస్తున్నాను'' అని టర్కీ అధ్యక్షుడు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఉగ్రవాద ముప్పును కలిసికట్టుగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే దాన్ని నిర్మూలించగలమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌పుతిన్‌ సూచించారు. ''అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కలిసికట్టుగా చేసినప్పుడు మాత్రమే ఉగ్రవాద ముప్పును మనం నివారించగలం'' అని ఆయన అన్నారు. ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు వ్యక్తులు నిధులు పంపించడాన్ని ఆపడానికి, ఐసిస్‌కు సింహ భాగం నిధులు అందిస్తున్న చమురు నల్లవిపణికి అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని సదరు తీర్మానం కోరవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  War on ISIS  Paris  G-20  Obama  France  Terrorism  ISIS terrorists  

Other Articles