Revanth reddy slams TRS and TRS govt

Revanth reddy slams trs and trs govt

Revanth Reddy, TTDP, warangal, Elections, Revanth reddy on KCR,TRS in warangal, warangal News, TRS with Congress

TTDP working President Revanth Reddy slams TRS party. He said that TRS and Congress party came to a understanding in Warangal elections.

అంతా టీఆర్ఎస్ మాయ: రేవంత్ రెడ్డి

Posted: 11/14/2015 04:05 PM IST
Revanth reddy slams trs and trs govt

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తు చేసిన తాజా కామెంట్లు దుమారం రేపుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ లోపాయకారి ఒప్పందం చేసుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎం సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను..రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లోన మాట్లాడుకున్న విషయాన్నే ఎంఎస్ ఆర్ బయటకు వెల్లడించారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీల మధ్య ఉన్న ఒప్పందం వెలుగు చూసిందన్నారు.

Also Read: మంత్రులు అటుఇటుకాని వారు: రేవంత్ 

ఒకవేళ ఎంఎస్ ఆర్ వ్యాఖ్యలతో విబేధించి ఉంటే..పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రశ్నించి ఉండాలని, సీఎల్పీ నాయకుడిగా జానారెడ్డి నోటీసులు ఇచ్చి ఉండాల్సిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, అది మురిగిపోయినట్టే అని..వరంగల్ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థి పైనా రేవంత్ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అభ్యర్థిని నిలపడానికి వాటర్ గ్రిడ్ పథకానికి కనెక్షన్ ఉందన్నారు. మంత్రి కేటీఆర్, వైసిపి అధినేత జగన్ మధ్య ఒప్పందంలో భాగంగా..జగన్ మనుషులకు వాటర్ గ్రిడ్ పనులు ఇచ్చారని, అందుకే జగన్ అభ్యర్థిని నిలిపారని రేవంత్ ఆరోపించారు. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి టీఆర్ ఎస్ గెలిచేందుకు పరోక్షంగా జగన్ సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles