Thanks to Paris residents

Thanks to paris residents

paris Attack, Paris, paris residents, paris bomb attacks, Social media on paris attack

paris residents giving place to tourists and unknown persons after Attack. they posting several msg in social media to come their homes.

ప్యారిస్ వాసులకు హ్యాట్సాఫ్.. అదీ మానవత్వం

Posted: 11/14/2015 03:21 PM IST
Thanks to paris residents

ప్యారిస్ లో దాడులకు దాదాపు 170 మంది చనిపోయారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు విచక్షణారాహితంగా చేసిన దాడికి వందల మంది గాయపడ్డారు. ప్రముఖ పర్యాటన ప్రదేశంగా గుర్తింపు ఉన్న ప్యారిస్ లో కాల్పులు జరగడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అక్కడికి పర్యటనలకు వెళ్లిన వారి గురించి వారి బంధువులు చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్యారిస్ నగర పౌరులు చేస్తున్న పనితో వార ఆందోళన తీరిపోతోంది.ప్యారిస్ వాసులు చేస్తున్న పని అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. అందరూ వారిని పొగడ్తలతో మెచ్చుకుంటున్నారు. మానవత్వం పరిమళిస్తే ఎలా ఉంటుంది అని ప్యారిస్ వాసులు చూపించారు.

Also Read: ముంబై తరహాలోనే ప్యారిస్ దాడి 

ప్యారిస్ లో జరిగిన కాల్పుల వల్ల వేల మంది పర్యాటకులు ఆందోళనలో పడ్డారు. ఎక్కడికి వెళ్లాలి..? ఏం చెయ్యాలి..? అన్న సందిగ్దంలో ఉన్నారు. దేశం కాని దేశంలో ప్రాణాలతో ఉన్నా కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం. అయితే అక్కడే ఉంటున్న ప్యారిస్ వాసులు మాత్రం మీకు మేమున్నాం అంటున్నారు. మా ఇంటికి రండి.. మా ఇంట్లో ఉండడానికి ముగ్గురికి అవకాశం ఉంది.. మా ఇంట్లో ముస్లింలకు కూడా చోటుందని.. ఇలా చాలా మంది సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. దాంతో దిక్కుతోచని పర్యాటకులకు ఆశ్రయం దొరుకుతోంది. అలా ప్యారిస్ వాసులు మానవత్వాన్ని చాటుతున్నారు. వారందరీ తెలుగు విశేష్ తరఫున హ్యాట్సాఫ్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris Attack  Paris  paris residents  paris bomb attacks  Social media on paris attack  

Other Articles