Insult to Telanaga CM KCR in amaravathi photo fair in delhi

Telanaga cm kcr face turns black as naidu hypocritical drama is out

Telanaga CM KCR, Insult to Telanaga CM KCR, black spot on kcr face, kcr face turns black, AP CM chandrababu Naidu, AP CM chandrababu Hypocritical drama, chandrababu Hypocritical drama, amaravathi photo fair exnibition

Insult to Telanaga CM KCR, as AP CM chandrababu Naidu Hypocritical drama is out in amaravathi photo fair exnibition in delhi

బయటపడ్డ చంద్రుడి ‘కపట’నాటకం.. నల్లగా మారిన కేసీఆర్ ముఖం

Posted: 11/14/2015 12:43 PM IST
Telanaga cm kcr face turns black as naidu hypocritical drama is out

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను ప్రత్యకంగా ఆహ్వానిస్తానని, చెప్పినట్లే చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ తంతు ముగిసిన అనంతరం మాత్రం అదే స్థాయిలో అవమానించారు. ముఖాలపై చిరునవ్వును ఒలకబోస్తూ.. కపట ప్రేమను నటించిన చంద్రబాబు.. తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూను కూడా కేసీఆర్ కు అందించి మరీ అహ్వానించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు చంద్రలు మధ్య ఇక పోరపచ్చాలు తోలగిపోయాయి అనుకుంటున్న సమయంలోనే మరోమారు తమ దమననీతి, ద్వంధ విధానాన్ని అవలంబించింది ఏపీ ప్రభుత్వం.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన కేసీఆర్ కు.. ఇప్పుడు అదే ప్రభుత్వం అవమానకర రీతిలో వ్యవహరించింది. ఢిల్లీలో అమరావతి ట్రేడ్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన ఫొటోల్లో మోడీ, చంద్రబాబు పక్కన ఉన్న కేసీఆర్ ముఖం కనిపించకుండా గ్రాఫిక్స్ లో నల్ల రంగు అద్దారు. శంకుస్థాపన శిలాఫలకం దగ్గర బాబు పక్కనే కేసీఆర్ ఉన్నారు. అందరి ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నా.. కేసీఆర్ ముఖానికి మాత్రం నల్లరంగు అద్దారు. అసలు ఆ ఫోటోలో వున్నది కేసీఆరేనా అన్నట్లుగా నల్లరంగు అద్దడం చర్చనీయాంశంగా మారింది.

ఓటుకు నోటు కేసులో పీకల వరకు కూరుకుపోయిన చంద్రబాబు.. దాని నుంచి బయట పడేందుకే కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించారని ఇప్పటికే అరోపించిన ప్రతిపక్షాల మాటలే నిజమయినట్లు తెలంగాణవాదులు బావిస్తున్నారు. ఏదో ఒక్క ఫొటోకు నల్లరంగు అనుకోకుండా జరిగిందని అనుకుంటే పోరబాటే.. కేసీఆర్ కనిపించే మరో మూడు ఫొటోలను కూడా ఈ విధంగానే గ్రాఫిక్స్ లో నల్ల రంగుతో మూసివేయటంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇక్కడ దోస్త్ లా వచ్చిన చంద్రబాబు..  దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనలో మాత్రం తన కపట వైఖరిని వ్యక్తం చేశారని, దోస్త్ దోస్త్ అంటూ కౌగలించుకున్న చంద్రబాబుది ధ్రుతరాష్ట్ర కౌగిలని తెలంగాణవాసులు ఇప్పటికైనా తెలుసుకోవాలని, ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం నేతలు బాబు నిజస్వరూపాన్ని కనుగోనాలని తెలంగాణవాసులు కోరుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మరో రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి పరాభవం, అవమానం చేయడం వెనుక కారణాలను కేంద్రం కనుగోని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు, ఎవరు ఎలాంటి వారో గ్రహించాలని కూడా తెలంగాణ వాసుతు కోరుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : KCR  Telangana  Chandrababu  AP  Delhi  Amaravathi photo fair  

Other Articles