Rahul Gandhi meets Prashant Kishor

Rahul gandhi meets prashant kishor

Rahul gandi, Modi, Bihar, elections, Bihar Polls, Modi on Bihar, Prashanth Kishore, Nitesh Kumar, Prashant Kishor behind the Bihar results

Congress vice-president Rahul Gandhi on Thursday met poll strategist Prashant Kishor, who was the main force behind Nitish Kumar’s campaign strategy in Bihar and also the man who sold Brand Narendra Modi during the 2012 Assembly polls in Gujarat and last year’s general elections.

మోదీని దెబ్బ తియ్యడానికి అతడితో చేతులు కలిపిన రాహుల్

Posted: 11/13/2015 04:20 PM IST
Rahul gandhi meets prashant kishor

బలంలేనప్పుడు అరటి పండు తిన్నా కూడా పళ్లూడుతుందని ఓ సామెత ఉంది. రాహుల్ గాంధీ ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బలం లేక గత ఎన్నికల్లో చతికలపడ్డ రాహుల్ గాంధీ ఇప్పుటి నుండి వచ్చే ఎలక్షన్ కోసం సిద్దం అవుతున్నారు. మోదీకి నాడు ఎవరైతే బలంగా నిలిచి.. గెలుపుకోసం వెనకుండి మొత్తం నడిపించారో వారినే రాహుల్ గాంధీ తన దగ్గరికి చేర్చుకుంటున్నారు. ఒక్కొక్కరిగా బలాన్ని పోగేసుకుంటూ.. మోదీని బలహీన పరుస్తున్నాడు. తాజాగా మరో కీలక వ్యక్తిని రాహుల్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. బీహార్ ఎన్నికల్లో మహా కూటమి గెలుపు కృషి చేసిన వ్యక్తితో రాహుల్ భేటీ అదే చర్చకు తావిస్తోంది.

Also Read: మోదీ అభిమాని.. నితీష్ గెలుపులో కీలకం

బీహార్ ఎన్నికల్లో మోదీ వర్గానికి భారీగా దెబ్బతగిలింది. మోదీ చరిష్మా మీద కూడా డౌట్  వచ్చేలా బీహార్ ఫలితాలు దిమ్మతిరిగిపోయేలా చేశాయి. అయితే బీహార్ లో మోదీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడానికి, మహాకూటమికి బలం చేకూర్చడానికి వెనకుండి తతంగం నడిపించిన ప్రశాంత్ కిషోర్ తో రాహుల్ భేటీ అయ్యారు. రానున్న కాలంలో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని ప్రశాంత్ తో రాహుల్ చర్చించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఇప్పటి నుండే రాహుల్ చేస్తున్న సరంజామా ఎంత వరకు పలితాలనిస్తుందో..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles