UK Media news on Hindu Talibanism in India

Uk media news on hindu talibanism in india

UK, Media, UK Media on Media, media on Modi, Modi UK visit, Modi in UK

UK Media slams Hindu Talibanism in India in the Modi period. UK Media explains that modi failed to control the intolarance in India.

ఇండియాలో హిందు తాలిబనిజం అంటూ బ్రిటన్ మీడియా వార్తలు

Posted: 11/13/2015 04:00 PM IST
Uk media news on hindu talibanism in india

బ్రిటన్ మీడియా ఇండియా గురించి చెత్త వార్తలు వస్తున్నాయి. బారత ప్రధాని నరేంద్ర మోదీ యుకె పర్యటనలో ఉండగా ఇలా వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాని మోడీ బ్రిటన్ లో బిజీగా ఉన్నారు. మీటింగ్ లు… ఒప్పందాలు అంటూ… తీరిక లేకుండా గడుపుతున్నారు. అక్కడ పత్రికలు మాత్రం ఆయనకు మరో రకంగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భఆరతదేశంలో పెరుగుతున్న అసహనతపై ఆర్టికల్స్ పై ఆర్టికల్స్ రాస్తున్నాయి. బుద్ధుడు, గాంధీ పుట్టిన దేశం అంటూ ఆయన చేసిన ప్రసంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా… మోడీ పాలనలో హిందుత్వ తాలిబన్లు పెరుగుతున్నారంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నాయి.

Also Read: బిజెపిని, మోదీని కాపాడే వ్యక్తి అతడే 

ఇండియాలో మానవహక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న శక్తులను అదుపులో ఉంచేలా ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలని పరోక్షంగా బ్రిటన్ ప్రధాని కామెరూన్ కు సూచిస్తున్నాయి అక్కడి పత్రికలు. ఇప్పటికే భారత్ లో తమ అవార్డులను వెనక్కి ఇచ్చేసిన రచయితలు, ఆర్టిస్టుల గురించి పెద్ద ఎత్తున వ్యాసాలు రాస్తున్నాయి. మోడీ ఇమేజ్ కు డ్యామేజ్ కలిగే విధంగా అక్కడి వ్యాసాలు ఉండటం బీజేపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఇండియాలోని మీడియా మాత్రమే మోదీని టార్గెట్ చేస్తే. తాజాగా యుకె మీడియా కూడా మోదీని విమర్శిస్తూ వార్తలు రాయడం ప్రతిపక్షాలకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. మరి దీని మీద మోదీ ఎలా స్పందిస్తారు.. ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొడతారన్నది చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UK  Media  UK Media on Media  media on Modi  Modi UK visit  Modi in UK  

Other Articles