hyderabad woman injured in chain snatchers attack while she was going to hospital along with her father | chain snatchers attack

Hyderabad woman injured in chain snatchers attack

chain snatchers attack, woman injured in chain snatching case, hyderabad chain snatching cases, woman injured in journey

hyderabad woman injured in chain snatchers attack : hyderabad woman injured in chain snatchers attack while she was going to hospital along with her father.

ITEMVIDEOS: మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. తీవ్రంగా గాడపడ్డ మహిళ

Posted: 11/10/2015 06:09 PM IST
Hyderabad woman injured in chain snatchers attack

చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. పోలీసులు వారిని చెక్ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. చైన్ స్నాచర్లు మాత్రం వాటికి ఏమాత్రం భయపడకుండా తమ దందాను కొనసాగిస్తున్నారు. రోడ్డుపై ఒంటరిగా వున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ వారి మెడలో వున్న గొలుసుల్ని లాక్కెళ్లిపోతున్నారు. అంతవరకు ఫర్వాలేదుగానీ.. సదరు మహిళలు తమ వెంటపడకుండా వుండేందుకు వారిని తీవ్రంగా గాయపరుస్తున్నారు కూడా. చైన్ లాగుతూనే వారిని కిందపడేస్తూ తీవ్ర గాయాలపాలు చేస్తున్నారు. ఈ తరహాలోనే తాజాగా మరో మహిళ చైన్ స్నాచర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మంగళవారం సికింద్రాబాద్ కంచన్‌బాగ్ సాయిబాబా టెంపుల్ ప్రాంతంలో ఆసుపత్రికి తన తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును చైన్ స్నాచర్లు అపహరించారు. ఆ మహిళ కాలు సరిగ్గా లేకపోవడంతో చాలా మెల్లగా వెళుతున్న వారిని గమనించిన చైన్ స్నాచర్లు.. ఆమె మెడలో వున్న చైన్ గమనించి దాన్ని అపహరించేందుకు ప్లాన్ వేశారు. సాధారణ వ్యక్తుల్లాగే వారిని కొంతదూరం వరకు బైకులో వెంటాడిన ఆ దుండగులు.. ఒకానొక సందర్భంలో స్పీడుగా వచ్చి ఆ మహిళ మెడలో వున్న గొలుసును లాక్కుపోయారు. దీంతో ఆమె స్కూటీపై నుంచి కింద పడిపోయింది. అప్పటికే కాలు నొప్పితో బాధపడుతున్న ఆ మహిళ చైన్ స్నాచర్ల దాడిలో మరింత గాయాలపాలయ్యింది. ఒకేసారి బైకుపై నుంచి కిందకు పడిపోవడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. దీంతో తండ్రి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది.

ఇదిలావుండగా.. ఈ మొత్తం తతంగం సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఈ దాడికి పాల్పడిన చైన్ స్నాచర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని నగరం దాటకుండా వుండేలా చెక్ పోస్టులకు సమాచారం అందించారని తెలుస్తోంది. వీరిని పట్టుకుంటే.. నగరంలో వుండే ఇంకా చాలామంది చైన్ స్నాచర్ల బండారం బయటపడుతుందని పోలీసులు నమ్ముతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad chain snatchers attack  woman injured  

Other Articles