a woman named saritha escaped with money, jewellery and licenced gun after her family member went into unconcious | women crime news

Woman saritha escaped with money jewellery licenced gun

women crime news, women escape with money, women escaped with boyfriends, women escaped with licenced gun, women escaped with money, woman cheat family members

woman saritha escaped with money jewellery licenced gun : a woman named saritha escaped with money, jewellery and licenced gun after her family member went into unconcious.

ఫ్యామిలీకి మత్తుమందిచ్చి.. ఉడాయించింది!

Posted: 11/10/2015 06:29 PM IST
Woman saritha escaped with money jewellery licenced gun

‘డబ్బులు సంపాదించడం ఎలా?’ ఈ ప్రశ్న కొంతమందిని ప్రయోజకుల్ని చేస్తే.. మరికొందర్ని పెడదారిలో నడిపిస్తోంది. ఎలాగైనా డబ్బులు ఆర్జించాలన్నా అత్యాశతో కొందరు మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. ఈ జాబితాలో పురుషులతోపాటు మహిళలు కూడా ముందుగా వుంటున్నారు. ఇప్పటికే నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఎన్నో మోసాలకు పాల్పడుతున్న మహిళలు.. ఆ అనుభవం లేనివారు తమదైన తెలివితేటలతో మోసాలు చేయడంలో తమకుతామే సాటిగా నిరూపించుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఓ మహిళ నిలిచిందనడంలో ఎటువంటి అనుమానం లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుదామని భావించిన ఓ మహిళ.. తన కుటుంబసభ్యులనే మోసం చేసి డబ్బులతో ఉడాయించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో జరిగింది.

ఫిరోజాబాద్ కు చెందిన సరిత అనే మహిళ తన కుటుంబసభ్యులతోనే వుంటూ వచ్చింది. అయితే.. ఇంతలోనే ఈమెకు ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఇంట్లో వుండే సొమ్ముతో ఉడాయించాలని ఓ పథకం రచించింది. ప్లాన్ ప్రకారం ఆమె.. గతరాత్రి తన కుటుంబసభ్యులకు మత్తుమందు కలిపి ఇచ్చింది. అది తాగిన వారు మత్తులోకి జారుకోగానే.. ఇదే సరైన అవకాశమని భావించి సరిత ఇంట్లో వున్న లైసెన్స్డ్  తుపాకీతో సహా భారీగా నగలు, నగదుతో ఉడాయించింది. తెల్లారి తేరుకున్న  కుటుంబ సభ్యులు.. సరిత కనిపించకపోవడంతో పాటు ఇంట్లో విలువైన వస్తువులు మాయం కావడంతో లబోదిబోమంటూ స్థానిక కొత్వాల్ పోలీస్ స్టేషన్  ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ నిమిత్తం ఒక కమిటీని నియమించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యువతి పారిపోవడానికి  గల కారణాలను ఆరా తీస్తున్నామని, ఇంతవరకు  ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు.

ఈ ఘటనపై పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యులకు తెలియకుండా సరిత ఎవరైనా ఓ వ్యక్తి ప్రేమాయణం నడుపుతుండవచ్చునని, అతనిని పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో వున్న నగదు తీసుకుని ఆమె ఉడాయించి వుంటుందని స్థానికులతోపాటు పోలీసులు సైతం అనుమానిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. విచారణ అయ్యేంతవరకు ఈ వ్యవహారం వెనుక అసలు కారణమేంటో చెప్పలేమని చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women crime news  saritha cheated family members  

Other Articles