karntaka minister H Anjaneyas wife Vijaya was caught allegedly taking a bribe from a contractor in a sting operation | sting operations

Karnataka congress ministers wife caught accepting bribe in sting operation

minister wife caught taking bride, karnataka wife caught in sting operations, minister anjaneya wife caught in sting operations, congress minister wife caught taking bride, anjaneya wife caught taking bride in sting, bjp party allegations, bjp party controversies, congress party controversies

Karnataka Congress ministers wife caught accepting bribe in sting operation : Social Welfare Minister H Anjaneya’s wife Vijaya was caught allegedly taking a bribe from a contractor in a sting operation, leaders from the Opposition parties BJP and Janata Dal (Secular) are demanding that he resign from his post and a high-level probe be ordered into the incident.

‘లంచం’ తీసుకుంటూ అడ్డంగా దొరికిన మంత్రిగారి భార్య

Posted: 11/06/2015 10:45 AM IST
Karnataka congress ministers wife caught accepting bribe in sting operation

ఓ ఛానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో ఓ మంత్రిగారి భార్య డబ్బులు తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. విద్యార్థి వసతి గృహాలకు ఆహారధాన్యాల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ కేటాయింపుల వ్యవహారంలో ఆమె కమీషన్ తీసుకుంటూ దొరికిపోయింది. ఆమె లంచం తీసుకుంటున్న దృశ్యాలను సదరు ఛానెల్ ప్రసారం చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పరిస్థితి నెలకొంది. సదరు మంత్రి తన పదవి నుంచి వెంటనే రాజీనామా చేయాలని విపక్ష పార్టీలు అప్పుడే డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హెచ్. ఆంజనేయ భార్య అయిన విజయ... విద్యార్థి వసతి గృహాలకు ఆహారధాన్యాల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ కేటాయింపుల వ్యవహారాలను చూసుకుంటారు. ఇందులో ఆమె డబ్బులు దండేస్తోందన్న విషయం ఓ టీవీ ఛానెల్ కు తెలియగా.. దాన్ని నిర్ధారించేందుకు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందుకు ఆ ఛానెల్ ఓ ప్లాన్ రచించింది. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో వున్న హాస్టల్స్‌కు బియ్యం, పప్పుధాన్యాలు, నూనె తదితర పదార్థాల సరఫరాకు ఓ ఏడాదికి సంబంధించిన కాంట్రాక్ట్ తమకే అందేలా చూడాలంటూ ఓ ప్రైవేటు టీవీఛానల్ ప్రతినిధులు ఆమెను సంప్రదించారు. సదరు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆమెను ఒప్పుకున్నారు కానీ.. అలా ఇప్పించినందుకు తనకూ కొద్దిమొత్తం ఇవ్వాలంటూ ఆమె అడిగారు. దాంతో వారు ఆమెకు రూ.7 లక్షల నగదును కమీషన్ రూపంలో అందజేశారు. ఈ వ్యవహారాన్ని సదరు టీవీ ఛానల్ ప్రతినిధులు రహస్యంగా చిత్రీకరించారు. ఆమెతో మంతనాలు జరిపిన అనంతరం తామేసిన గాలంలో చేప దొరికిందంటూ వెంటనే ఆ దృశ్యాలను ప్రసారం చేశారు. అంతే! అది రాష్ట్ర రాజకీయాలతోపాటు అధికార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు.. విపక్ష బీజేపీ పార్టీ నాయకులు ఆంజనేయ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా దలిత వర్గానికి చెందిన తమను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో కొంతమంది తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని హెచ్. ఆంజనేయ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.  మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ విషయమై మాట్లాడుతూ...‘హెచ్. ఆంజనేయ మంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే పోరాటానికి దిగుతాం.’ అని హెచ్చరించారు. రానురాను ఈ వ్యవహారం ఆ రాష్ట్రంలో ఎన్ని వివాదాలకు దారితీస్తుందో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles