a woman judge files harassment case against lawyer in new delhi | harassment cases | rape incidents

Woman judge files harassment case against lawyer in delhi

woman judge case, harassment case, harassment cases in delhi, delhi crime news, delhi rape cases, delhi rape incident, lawyer harassed judge, women judge harassed by lawyer

woman judge files harassment case against lawyer in delhi : a woman judge files harassment case against lawyer in new delhi.

మహిళా జడ్జిని వేధించిన న్యాయవాది

Posted: 11/06/2015 11:53 AM IST
Woman judge files harassment case against lawyer in delhi

మహిళలు ఎంత ఉన్నత స్థానంలో వారికి మృగాళ్ల నుంచి ఆగడాలు తప్పవన్న నిఖార్సైన నిజానికి ఈ సంఘటన ఓ నిదర్శనం. ఏకంగా ఓ మహిళా జడ్జినే ఓ న్యాయవ్యాది లైంగికంగా వేధించాడంటే.. సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ న్యాయవాదిపై మహిళా న్యాయమూర్తి తాజాగా ఫిర్యాదు చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

న్యూఢిల్లీలోని ఓ కోర్టులో అక్టోబర్ 30న ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ ఆ మరుసటి రోజున ఢిల్లీ పోలీసులకు ట్రాఫిక్ కోర్టు న్యాయమూర్తి ఫిర్యాదు చేసింది. కోర్టులో తనను ఆ న్యాయవాది దుర్భాషలాడాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టును వాయిదా వేయించేందుకు తనపై ఈవిధంగా ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. అంతేకాదు.. తాను విచారణను వాయిదా వేసినా కూడా తనను అసభ్య పదజాలంతో ఆ లాయర్ దుర్భాషలాడాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈమె ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ పోలీసులు.. నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే.. దీనిపై ఆ జడ్జి ఆరోపణలు చేస్తున్న న్యాయవాది స్పందన మాత్రం మరోలా వుంది. అసలు తాను ఆమెను దుర్భాషలాడలేదని, ఆమె తనతో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిందని ఆరోపిస్తున్నాడు.

దీనిపై ఆ న్యాయవాది స్పందిస్తూ తన క్లయింట్ డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడటంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. జరిమానా చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని న్యాయమూర్తి తీర్పునివ్వడంతో తన క్లయింట్ అరగంట సమయం అడిగినట్లు పేర్కొన్నాడు. అనంతరం జరిమానాను చెల్లించేందుకు వెళ్లగా మరుసటి రోజు రావాలని న్యాయమూర్తి ఆదేశించగా, తాను అడ్డుకొని నిబంధనలను పాటించాలని ఆమెకు సూచించినట్లు తెలిపాడు. దీంతో ఆమె తమతో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించారని న్యాయవాది పేర్కొన్నాడు. దీంతో ఆమెపై జిల్లా జడ్జితో పాటు బార్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఆ మరుసటి రోజున ఆమె తనపై ఫిర్యాదు చేసిందని తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman judge harassed by lawyer  lawyer harassed judge  

Other Articles