Nitish Kumar gave explanation on Tantrik meeting

Nitish kumar gave explanation on tantrik meeting

Nitish Kumar, Tantrick, Bihar, elections, BJP, Modi, Bihar polls

Bihar cm Nitish Kumar two years back met Tantrik. BJP release a video of Nitish kumars in this elections.

ఆ మాంత్రికుడిని సిఎం ఎందుకు కలిశారంటే...

Posted: 10/29/2015 11:26 AM IST
Nitish kumar gave explanation on tantrik meeting

అవును.. ఓ రాష్ట్రానికి సిఎం.. అలాంటి వ్యక్తి మంత్రగాడిని కలిసిన వీడియో నెట్ లో హల్ చల్ చేసింది. అంతేనా..? ఎన్నికల సందర్భంగా విపక్షాల నాయకలు దీని మీద మండిపడ్డారు. అయితే మొత్తానికి దాని మీద ఆ సిఎం స్పందించారు. తాను ఎందుకు అలా చేశారో.. ఎప్పుడు చేశారో కూడా తెలిపారు. బీహార్ సిఎం నితీష్ కుమార్ మాంత్రికుడిని కలిసిన వీడియోతో ఎన్నికల ప్రచారంలో మార్పు వచ్చింది. నితీష్ మీద తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. మోదీతో సహా పలువురు నాయకులు విమర్శలు గుప్పించారు. కాగా నితీష్ ఎందుకు కలిశారు.. ఎప్పుడు కలిశారు..? తెలుసుకోండి.

బీహార్ సిఎం నితీష్ కుమార్ ఓ మాంత్రికుడిని కలిసిన వీడియో ఎన్నికల్లో దుమారం రేపింది. కానీ నిజానికి అది రెండేళ్ల క్రితం వీడియో అని నితీష్ కుమార్ వివరణ ఇచ్చారు. గతంలో ఆ మాంత్రికుడి వద్దకు వెళ్లిన మాట వాస్తవానికి మాంత్రికుడు చెప్పింది విని వచ్చేశానని అన్నారు. అయినా రెండేళ్ల క్రితం జరిగిన దానిని ఇప్పుడు ప్రచారం చెయ్యడంతో ఎవరి మతలబు ఏంటో అర్థమవుతోందని అన్నారు. అలాగే మిగిలిన పార్టీల నాయకులు ఎవరూ కూడా సాధుసంతులను నమ్మనట్టుగా మాట్లాడుతున్నారని.. అదే నిజమేతే మోదీ ఎందుకు సాధులను కలుస్తున్నారో చెప్పాలని నితీష్ ప్రశ్నించారు. మొత్తానికి మాంత్రికుడితో నితీష్ వ్యవహారంలో నితీష్ నోరువిప్పి అసలు మ్యాటర్ ఏంటో చెప్పాడు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Tantrick  Bihar  elections  BJP  Modi  Bihar polls  

Other Articles