mlc devendra pratap singh create sensation by making controversial comments on cm akhilesh yadav | samajwadi party controversy

Mlc devendra pratap singh sensational comments on cm akhilesh yadav samajwadi party

mlc devendra pratap singh, akhilesh yadav, mulayam singh, samajwadi party. uttar pradesh politics, uttar pradesh crime stories, akhilesh yadav controversies, akhilesh yadav latest news

mlc devendra pratap singh sensational comments on cm akhilesh yadav samajwadi party : mlc devendra pratap singh create sensation by making controversial comments on his own samajwadi party cm akhilesh yadav.

‘అఖిలేష్.. ఓ పనికిమాలిన ముఖ్యమంత్రి’

Posted: 10/29/2015 11:21 AM IST
Mlc devendra pratap singh sensational comments on cm akhilesh yadav samajwadi party

అతి చిన్న వయస్సుల్లోనే ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన అఖిలేష్ యాదవ్.. మొదట దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన యువతకు దిశానిర్దేశకుడిలాంటి వాడని, సమాజంలో మార్పు తెచ్చేందుకు క్రీయాశీల రాజకీయాల్లో అడుగుపెట్టాడని, సీఎం స్థానాన్ని దక్కించుకుని తన సత్తా చాటుకున్నాడని.. ఇలా ఎన్నోరకాలుగా ప్రముఖుల నుంచి పొగడ్తల వర్షాన్ని తనమీద కురిపించుకున్నాడు ఈ కుర్ర సీఎం. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు చేస్తే అంత ప్రాధాన్యత వుండదు కానీ.. సొంత పార్టీ ఎమ్మెల్సీయే ఆయనపై కుండబద్ధలు కొట్టాడు. అఖిలేష్ ని ఓ పనికిమాలిన సీఎంగా ఆ ఎమ్మెల్సీ అభివర్ణించాడు.

‘ఇప్పుడున్నది అసలు రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి.. వెంటనే ఆయనను మార్చేసి అనుభవజ్ఞుడైన, సమర్థుడైన కొత్త ముఖ్యమంత్రిని పెట్టండి. లేకపోతే పార్టీ మనుగడే అనుమానంలో పడుతుంది’ అంటూ ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్ సింగ్ తమ సొంత పార్టీ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు గుప్పించారు. పైగా.. ఆయన సూచన చేసింది మరెవ్వరినో కాదు.. సాక్షాత్తు పార్టీ పెద్దాయన ములాయం సింగ్ యాదవ్‌కి. నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ అఖిలేష్ యాదవ్ ఒక గుర్తింపు కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారని, చాలా సందర్భాల్లో ఆయన పనితీరు సరిగా ఉండట్లేదని సింగ్ తాజాగా చెప్పారు. యూపీ చరిత్రలోనే అత్యంత బలహీనమైన, అసమర్థ ముఖ్యమంత్రిగా ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. ఉత్తరప్రదేవ్ రాష్ట్రానికి అఖిలేష్ ఓ బండలా తగులుకున్నారని విమర్శించారు. ఈయన సీఎంగా ఇంకా కొన్నాళ్లు కొనసాగితే.. పార్టీ మనుగడ లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అభిప్రాయం వెల్లడించారు. అందువల్ల పార్టీ బతికుండాలంటే వెంటనే సీఎంను మార్చేయాల్సిందిగా నేతాజీని (ములాయం) కోరతున్నానని ఆయన విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు.

ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసే అన్ని సంస్థలలోను అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని దేవేంద్ర ప్రతాప్ ఇటీవలే ఆరోపించారు. యూపీపీఎస్‌సీ గత రెండేళ్లలో చేసిన నియామకాలు అన్నింటి మీదా సీబీఐ దర్యాప్తు చేయించాలని జూలై నెలలో ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ కూడా రాశారు. ఇప్పుడు తాజాగా తమ సొంత పార్టీ ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయారు. మరి.. ఈయన వ్యాఖ్యలపై ములాయం ఏ విధంగా స్పందిస్తారో.. అఖిలేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mlc devendra pratap singh  cm akhilesh yadav  samajwadi party  mulayam singh  

Other Articles