Osama was our hero

Osama was our hero

Osama, Laden, Pakistan, India, Terrorist, Pervez Musharraf

Former military ruler Pervez Musharraf has admitted that Pakistan supported and trained groups like Lashkar-e-Taiba (LeT) in 1990s to carry out militancy in Kashmir. “In 1990s the freedom struggle began in Kashmir...At that time Lashkar-e-Taiba and 11 or 12 other organisations were formed. We supported them and trained them as they were fighting in Kashmir at the cost of their lives,” Musharraf said in an interview to Dunya News

బిన్ లాడెన్ మా హీరో

Posted: 10/28/2015 11:15 AM IST
Osama was our hero

అవును.. మీరు చదువుతున్నది నిజమే. కరడుగట్టిన ఉగ్రవాది వేల సంఖ్యలో అమాయకులు మరణానికి కారకుడైన లాడెన్ వారికి మాత్రం హీరో అట... అంతే కాదు అక్కడ ఉగ్రవాదులకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి మరీ పంపుతారట. ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా..? పాకిస్థాన్. భారత దాయాది దేశం పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పిన సత్యాలు ఇవి.  అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో కళ్లకు కట్టే వాస్తవాలు ఇవి. ముషారఫ్ ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో భారత్ తో కాశ్మీర్ యుద్దానికి దిగినప్పుడు చాలా మంది పాకిస్థాన్ కు సహాయం చేశారని... ముఖ్యంగా ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ కు సహాయం చేశాయని పర్వేజ్ వెల్లడించారు.

పర్వేజ్ ముషారఫ్ ఉగ్రవాద సంస్థలతో, ఉగ్రవాదులతో ఉన్న సంబందాల మీద కూడా నోరువిప్పారు. పాకిస్థాన్ ప్రభుత్వం చాలా ఉగ్రవాద సంస్థలకు బాసటగా నిలుస్తోందని... ఉగ్రవాదులకు ప్రత్యేకంగా ట్రెయినింగ్ ఇవ్వడానికి కూడా పాక్ ప్రభుత్వం సహాయం చేసిందని వెల్లడించారు. అలాగే శిక్షణ పొందిన ఉగ్రవాదులు రష్యా మీద దాడికి పంపినట్లు కూడా తెలిపారు. ఒసామాబిన్ లాడెన్ లాంటి వాళ్లు తమకు హీరోలు అని అన్నారు. కానీ తర్వాత కాలంలో బిన్ లాడెన్ లాంటి వాళ్లు విలన్ లుగా మారారని... తమ సొంత మనుషులనే చంపుకున్నారని కూడా ముషారఫ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Osama  Laden  Pakistan  India  Terrorist  Pervez Musharraf  

Other Articles