Nitish Kumar as Loktantrik and Lalu Prasad as tantrik

Nitish kumar as loktantrik and lalu prasad as tantrik

Modi, Nitesh Kumar, lalu prasad, Bihar Elections, Tantrik, loktantrik

Prime Minister Narendra Modi described Nitish Kumar as “Loktantrik” and Lalu Prasad as “tantrik” Sunday. He was playing on a video gone viral that shows Nitish with a tantrik, who is heard asking the CM why he has teamed up with Lalu, and saying, “Nitish zindabad, Lalu murdabad.”

మోదీ చెప్పిన మాయగాళ్లు ఎవరో తెలుసా..?

Posted: 10/26/2015 09:21 AM IST
Nitish kumar as loktantrik and lalu prasad as tantrik

జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల నేతృత్వంలోని మహా కూటమి ఒక మహా తాంత్రిక కూటమి అని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం బీహార్‌లో సుడిగాలి పర్యటన చేసిన మోదీ.. లాలూ సొంత జిల్లా ఛాప్రా, నితీశ్ సొంతగడ్డ నలందతోపాటు పాట్నా, గయలలో జరిగిన ఎన్నికల సభల్లో మాట్లాడారు. లాలూను వదిలించుకునేందుకు తాంత్రికవేత్తతో సమావేశమైన నితీశ్‌కుమార్.. ఆర్జేడీ అధినేతతో ఎలా జత కట్టారని ప్రశ్నించారు. ఇప్పటివరకు మహా కూటమిలో బడాభాయ్ లాలూ, ఛోటాభాయ్ నితీశ్, మేడం సోనియాగాంధీ మాత్రమే ఉన్నారని తనకు తెలుసునన్నారు.

కానీ నాలుగో వ్యక్తి తాంత్రికవేత్త రంగ ప్రవేశంతో అది మహా అవకాశవాద కూటమిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో తాంత్రిక విద్యలకు చోటు లేదన్నారు. బీహార్ సీఎం నితీశ్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ తిరోగామి ఎజెండాపై అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. లాలూ, నితీశ్ కులం పేరుతో విషపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీహార్‌ను 21 శతాబ్దిలోకి తీసుకెళ్లాలంటే 18వ శతాబ్ది నాటి ఆలోచనలు గల వారి నుంచి రాష్ర్టానికి స్వేచ్ఛ ప్రసాదించాల్సి ఉంది. మనకు జంతర్‌మంతర్ మాయలొద్దు. మన యువత చేతిలో లాప్‌టాప్‌లు కావాలి. తావీజ్‌లు కాదు అని ఆయన అన్నారు. జంగిల్ రాజ్ కావాలో, అభివృద్ధితో కూడిన పాలన కావాలో తేల్చుకోవాలని బీహారీలకు పిలుపునిచ్చారు.

లాలూజీ.. మీరు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద తాంత్రికవేత్త అయితే మీ పార్టీకి రాష్ట్రీయ జాదుటోన పార్టీ అని పేరు పెట్టుకోండి అని మోదీ సలహా ఇచ్చారు. లాలూకు తన ఇద్దరు కుమారుల రాజకీయ భవిష్యత్ తప్ప ఇతరుల సమస్యలు పట్టవన్నారు. తన రాకను స్వాగతిస్తూ సభికులు నినాదాలు చేయడంతో బీహార్ ఎన్నికల్లో విజయం తథ్యమని ఆయన చెప్పారు. ఇది ఎన్నికల ప్రచార సభ కాదని పరివర్తన మేళా అని అభివర్ణించారు. బీహార్ అభివృద్ధికి నితీశ్‌కుమార్ ప్రకటించిన సప్తసూత్ర పథకానికి ప్రత్యామ్నాయంగా మోదీ ఆరు సూత్రాల పథకం ప్రతిపాదించారు. రాష్ర్టాభివృద్ధిలో కీలకమైన విద్యుత్, నీరు, రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Nitesh Kumar  lalu prasad  Bihar Elections  Tantrik  loktantrik  

Other Articles