Geeta to reach Delhi from Pak today

Geeta to reach delhi from pak today

arrival ,Geetha ,india ,pakisthan, Bhajarngi Bhaijan, Geetha in Pakistan

Nearly 15 years after she accidentally crossed the border, young deaf-mute woman Geeta will arrive in Delhi on Monday to be reunited with her family in India. Geeta will arrive at the IGI airport in Delhi at 10.20am by Pakistan International Airlines Flight 272 from Karachi, accompanied by five members of the Edhi Foundation which has been fostering her, sources at the Pakistan high commission said.

నేడు భారత్ కు రానున్న గీత

Posted: 10/26/2015 08:01 AM IST
Geeta to reach delhi from pak today

భజరంగీ భాయ్ జాన్ సినిమా తర్వాత వెలుగులోకి వచ్చిన పాకిస్థాన్ లోని గీత... దశాబ్దం తర్వాత నేడు పురిటిగడ్డపై అడుగుపెట్టనుంది. చిన్నప్పుడు తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరుకున్న చెవిటి, మూగ యువతి గీతకు కరాచీలోని ఈదీ ఫౌండేషన్ ఆశ్రయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. గీతను భారత్‌కు రప్పించేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 8గంటలకు గీత పాకిస్థాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతుంది.

ఆమె వెంట నేను, మా తండ్రి ఫైసల్ ఈదీ, మా అమ్మ, మా నాన్నమ్మ బిల్‌ఖ్వాస్ ఈదీ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నాం.. అని ఈదీ ఫౌండేషన్ ప్రతినిధి ఫహద్ ఈదీ ఆదివారం కరాచీలో మీడియాకు చెప్పారు. ఇప్పటికే గీత బీహార్‌లో తన కుటుంబం ఉంటున్నట్టుగా ఫొటోల ఆధారంగా గుర్తించిందని, డీఎన్‌ఏ పరీక్షల్లో పాజిటివ్‌గా వస్తే ఆ కుటుంబానికి గీతను అప్పగిస్తామన్నారు. ఒకవేళ పరీక్షలు నెగెటివ్‌గా వస్తే.. గీతకు ప్రత్యేకంగా ఆశ్రయం కల్పించి, తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకుంటామని భారత హైకమిషన్ హామీ ఇచ్చిందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arrival  Geetha  india  pakisthan  Bhajarngi Bhaijan  Geetha in Pakistan  

Other Articles