Mahendra Singh Dhoni Says A Proper Batsman at Number Seven is Required in ODIs

New rules demand good batsmen at no 7 says dhoni

India vs south africa,India vs South Africa 5th ODI Players,India vs South Africa 5th ODI,India vs South Africa 5th ODI key players,Players to watch out for in 5th ODI,India vs South Africa 5th ODI teams,India vs South Africa 5th ODI Rohit Sharma,Rohit Sharma,MS Dhoni,Virat Kohli,AB de Villiers,Mumbai series decider 5th ODI, Gandhi-Mandela Series 2015 India India vs South Africa India vs South Africa 2015 South Africa South Africa tour of India 2015 South Africa vs India South Africa vs India 2015

With the change in ODI rules, India skipper Mahendra Singh Dhoni has emphasised that batsman who can finish off the innings in style batting at number seven provide immense value to the team.

టీమిండియాకు పటిష్ట మిడిల్ ఆర్డర్ అవసరం.. 7వ స్థానమే ముఖ్యం

Posted: 10/24/2015 06:47 PM IST
New rules demand good batsmen at no 7 says dhoni

టీ20 సిరీస్ ను దక్షిణాఫ్రికాకు క్లీన్ స్వీప్ గా అందించిన తరువాత వన్డే సిరీస్ లో తడబడుతూ ప్రస్తుతం సమఉజ్జీలుగా వున్న ధోని సేన.. టైటిల్ ను దక్కించుకునేందుకు మరో అడుగు దూరంలో వుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా  దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైన అనంతరం ఐదు, ఆరు, ఏడు స్థానాల్లోని బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులపై దృష్టి సారించినట్లు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశారు. మరోసారి మిడిల్ ఆర్డర్ ను పటిష్ట పరచాల్సిన అవసరం ఉందన్నాడు.

కొత్త బంతితో ఆరంభమైన ఇన్నింగ్స్ లో ప్రత్యర్థికి ఆదిలోనే రెండు వికెట్లు సమర్పించుకుంటే అది మిడిల్ ఆర్డర్ పై ప్రభావం చూపుతుందన్నాడు.  ఆ క్రమంలోనే 40 నుంచి 50 ఓవర్లు మధ్య భారీ షాట్లు ఆడి పరుగులు చేయడం కష్ట సాధ్యంగా మారుతుందన్నాడు. దాన్ని అధిగమించాలంటే కచ్చితంగా ఏడో స్థానంలో సరైన ఆటగాడు ఉండాలని ధోని తెలిపాడు. మారిన నిబంధనల ప్రకారం  స్లాగ్ ఓవర్లలో పరుగులు రాబట్టడంతో పాటు పరిస్థితులు తగ్గట్టు ఆడాలంటే ఏడో స్థానాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నాడు.
 
'చివరి ఓవర్లలో ఆడటం అంత తేలిక కాదు. జట్టు వ్యూహంలో భాగం పంచుకుంటూ  ఆఖరి 10 ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలి. ఆ ఓవర్లలో 80 నుంచి 90పరుగులు రాబడితేనే మ్యాచ్ పై పట్టు చిక్కుతుంది. అందుకు ఏడో స్థానం ఎంతో కీలకం. కొత్త నిబంధనలతో  చివరి 10 ఓవర్లలో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు ఉంటారు. ఆ సమయంలో భారీ షాట్లు ఆడటం చాలా క్లిష్టం. అందుకు ఏడో స్థానంలో వచ్చే ఆటగాడు యోగ్యమైన బ్యాట్స్ మెన్ అయితేనే పరుగులు సాధించే అవకాశం ఉంది' అని ధోని పేర్కొన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  team india  south africa  eries decider  

Other Articles