errabelli revanth argue at party meeting

Errabelli suggests revanth to respect seniors in party

errabelli suggests revanth, errabelli warns revanth, errabelli revanth argue, errabelli revanth warning, errabelli revanth party meeting, errabelli revanth hot, errabelli dayakar rao, revanth reddy, bjp, tdp leaders meet, warangal bye elections

Telangana senior Tdp mla errabelli and revanth reddy argue in party meeting at golconda hotel, sr leaders supports errabelli and sugests revanth to respect senior party leaders

రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి వార్నింగ్.. దూకుడు తగ్గించాలని హితవు

Posted: 10/24/2015 07:19 PM IST
Errabelli suggests revanth to respect seniors in party

ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు లంచం ఇస్తూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ.. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టై.. బెయిలుపై విడుదల కాగానే తన అభిమానుల మధ్య మీసం మెలేసి తెలంగాణ ప్రజల్లో హీరోగా మారిన రేవంత రెడ్డికి స్వంత పార్టీ నేతల నుంచి పరాభవం ఎదురవుతుంది. ఇవాళ గోల్కండ హోటల్ లో సాగిన సమావేశంలో తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికపై చర్చించేందుకు శనివారం టీటీడీపీ నేతలు సమావేశమైనపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి, రేవంత్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సీనియర్ నేతలు ఎర్రబెల్లికి మద్దతుగా నిలిచి.. దూకుడు తగ్గించుకోవాల్సిందిగా రేవంత్కు హితవు పలికారు. పార్టీలో సీనియర్లను గౌరవించాలని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడటం సరికాదని రేవంత్కు సూచించారు. ఓటుకు కోట్లు కేసు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. దీని వల్ల పార్టీకి భారీ నష్టం జరిగిందని, ఇకనైనా దూకుడు తగ్గించి జాగ్రత్తగా వ్యవహరించాలని రేవంత్కు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణతో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli dayakar rao  revanth reddy  ttdp  

Other Articles