AP govt slashed cheap liquior prices in ap

Ap govt slashed cheap liquior prices in ap

AP, Liquior, AP Govt, Chandrababu Naidu, Liquior policy, AP liquior policy

AP govt took cheep decision on cheap liquior. chandrababu Naidu offering more liquior at the same cost.

చీప్ లిక్కర్ మరింత చీప్

Posted: 10/24/2015 08:58 AM IST
Ap govt slashed cheap liquior prices in ap

చీఫ్ లిక్కర్ అంటే కేరాఫ్ తెలుగు రాష్ట్రాలు అన్నట్లుగా తయారవుతోంది పరిస్థితి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా చీఫ్ లిక్కర్ అమ్మకాల మీద చూపుతున్న ఉదారతను చూస్తే నిజమే అనిపిస్తోంది. తాజాగా ఏపి ప్రభుత్వం చీఫ్ లిక్కర్ కు ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. వీలైనంత ఎక్కువగా మద్యాన్ని తాగించడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చౌక మద్యం పేరుతో చీప్ లిక్కర్-కు దసరా ముందు రోజు గేట్లు తెరిచింది. అందుకు అనుగుణంగా తక్కువ రకం మద్యం ధరలపై ఎక్సైజ్ డ్యూటీని, వ్యాట్-ను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రకాల మద్యంపై ఎక్సైజ్ డ్యూటీని, వ్యాట్-ను పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీంతో తక్కువ రకం మద్యం ధరలు మరింత తక్కువ కానుండడంతో పాటు విక్రయాలు పెరిగి ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరగనుంది.

ప్రస్తుతం 90 మిల్లీ లీటర్ల మద్యం బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉండగా కొత్తగా 60 మిల్లీ లీటర్ల మద్యం బాటిల్స్-ను కూడా మార్కెట్-లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి 60 మిల్లీ లీటర్ మద్యం 20 రూపాయలకే మద్యం సేవించే వారికి మార్కెట్లో దొరుకుతుంది.. ఏపీ సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే చేసిన ఐదు తొలిసంతకాలలో బెల్ట్‌షాపుల రద్దు ఒకటి. కానీ ఇప్పుడు బెల్ట్ షాపుల ప్రస్తావన లేకుండానే భారీగా చీప్‌లిక్కర్ అమ్మకాలకు గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తెస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Liquior  AP Govt  Chandrababu Naidu  Liquior policy  AP liquior policy  

Other Articles