Central Minister apologises for dog remark on Dalit killings

Central minister apologises for dog remark on dalit killings

VK Singh, Dog marks, Dalits, haryana, Dalit Killing in Haryana

Central Minister apologises for dog remark on Dalit killings. Under fire for allegedly drawing an analogy between the killing of Dalit children in Faridabad and stoning of a dog, Union Minister VK Singh has tendered an apology and said that his remarks were 'mixed' to present a wrong picture.

కేంద్రమంత్రి ‘కుక్క’ అన్నాడు.. మళ్లీ ‘సారీ’ చెప్పారు

Posted: 10/24/2015 08:56 AM IST
Central minister apologises for dog remark on dalit killings

ఎన్డీయే ప్రభుత్వానికి తలనొప్పుల బెడద ఎంతకీ తీరడం లేదు. ఎన్డీయే లేదంటే బిజెపి పార్టీకి చెందిన నాయకులు ఏదో మాట్లాడటం దాని మీద దుమారం రేగడం సాగుతోంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు, మిత్రపక్షాల నాయకులు మితంగా జాగ్రత్తగా మాట్లాడాలని బిజెపి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే సూచనలు చేసినా అది పనిచెయ్యడం లేదు. తాజాగా కేంద్ర మంత్రి వీకె సింగ్ తన ‘‘కుక్క’’ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు మీడియా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని చెప్పారు. కేంద్ర మంత్రులు ప్రజలకు ప్రజలకు జవాబుదారీ వహించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని రాజ్‌నాథ్ సూచించారు.

బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎవరు.. ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యవద్దని అమిత్ షా గతంలోనే హుకుం జారీ చేశారు. కాగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. తప్పుగా మాట్లాడి మీడియా ముందు చులకన కావద్దని.. పార్టీకి నష్టం కలిగిస్తే తాను ఊరుకునేది లేదని కూడా వెల్లడించారు. పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలను తీసుకుంటుందని వెల్లడించారు. బీహార్ లో ఎన్డీయే, బిజెపి నాయకుల మాటలనే తమ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి అక్కడి పార్టీలు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు బిజెపి మీద ఒంటికాలు మీద లేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VK Singh  Dog marks  Dalits  haryana  Dalit Killing in Haryana  

Other Articles