pm modi gives yamuna water to ap cm

Pm modi gives yamuna water parliament soil to amaravati

amaravati, andhra pradesh, yamuna water, parliament soil, amaravati capital, chandrababu naidu, andhra capital, guntur, andhra capital city, narendra modi, tdp, andhra new capital, andhra amaravati, ap capital amaravati, pm narendra modi amaravathi foundation, chandrababu amaravathi foundation occassion, kcr amaravathi, governor narasinhan, venkaiah naidu, ap ministers, union ministers, amaravathi invitees, sai kumar, sunitha, shivamani drums, sai kumar sunitha welcome amaravati invitees, photo gallary, governers, ministers, nirmala sitaraman

PM Narendra Modi gives Yamuna river water and parliament soil to AP CM Chandrababu Naidu for AP capital Amaravati

అమరావతికి నేనే సైతం అన్న ప్రధాని.. పార్లమెంటు మట్టి, యమునానది నీరు బాబుకు అందించిన మోదీ

Posted: 10/22/2015 01:18 PM IST
Pm modi gives yamuna water parliament soil to amaravati

నవ్యాంధ్రధప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధానమంతి నరేంద్రమోదీ 'నేనుసైతం' అంటూ ముందుకొచ్చారు. పార్లమెంటు వద్ద సేకరించిన మట్టి, పవిత్ర యమునా నది నీటిని సేకరించి తానే స్వయంగా తీసుకువచ్చి అమరావతి రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా 'మన మట్టి-మన నీరు' అంటూ తెలుగులో మాట్లాడి సభికులను ఆశ్చర్యానికి గురిచేశారు. మహాకవి శ్రీశ్రీ కవితను గుర్తుచేస్తూ.. 'నేనుసైతం ప్రజారాజధాని అమరావతికి మట్టిని సమర్పిస్తున్నాను' అని ప్రకటించగానే ప్రజలు కరతాళధ్వనులు చేశారు.

కాగా, అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై 15 మంది ప్రముఖులు ఆశీనులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ, తెలంగాణ, పంజాబ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ప్రకాశ్‌సింగ్ బాదల్..... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్  ఈఎస్‌ఎల్ నరసింహన్, తమిళనాడు, అసోం గవర్నర్లు కె. రోశయ్య, పీబీ ఆచార్య... సింగపూర్, జపాన్ మంత్రులు ఈశ్వరన్, యోసుకే తకాగి.... కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయ  కూర్చున్నారు. రితో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసాలే కూర్చొన్నారు. ప్రధాన వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన మరో రెండు వేదికలపై ....రాష్ట్ర మంత్రులు,  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు కూర్చున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM modi  amaravathi  yamuna water  parliament soil  

Other Articles