Jagan said dont but Yanamala said they will

Jagan said dont but yanamala said they will

Jagan, Yanamala, Amaravati, Amaravati Inauguration, Amaravati Invitation, Jagan on Amaravati, Jagan Mohan Reddy on Amaravati, Jagan letter, AP Capital, Capital city

YS Jagan Mohan Reddy said dont send invitation for Amaravati Inauguration ceremony. but AP Minister Yanamala Ramkrishnudu said that ap govt will send invitation to opposition leader Jagan.

జగన్ వద్దన్నా.. పంపిస్తామంటున్న యనమల

Posted: 10/16/2015 11:12 AM IST
Jagan said dont but yanamala said they will

ఆయనేమో వద్దంటారు.. కానీ మేము మాత్రం పంపిస్తామంటూ వీళ్లు.. ఇలా ఏపిలో రాజకీయ నాయకుల మధ్య నడుస్తున్న సంభాషణలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఏపి రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు అందరికి ఆహ్వానం పంపుతున్నారు. కొంత మందికి స్వయంగా తానే పంచుతున్నారు. కాగా నిన్న ఏపి ప్రతిపక్ష నాయకుడు జగన్ చంద్రబాబుకు ఓ లెటర్ రాశారు. అమరావతి శంఖుస్థాపనకు తనకు ఆహ్వానం పంపించవద్దని.. పంపినా తాను మాత్రం రావడం లేదని తెలుపుతూ ఎనిమిది కారణాలను వివరించారు. అయితే వైసీపీ అధినేత ఇలా ఆహ్వానం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యడం కొత్త చర్చకు దారి తీసింది. కాగా ఏపి కేబినెట్ మంత్రులలో యనమల మొదటిసారిగా జగన్ లెటర్ మీద స్పందించారు. జగన్ కు ఆహ్వానం పంపించడం మీద ఆయన ఏమన్నారంటే..

అమరావతి శంఖుస్థాపనకు అందరికి ఆహ్వానాలు పంపుతున్నామని.. అందులో భాగంగా ఏపి ప్రతిపక్ష నాయకుడు జగన్ కు కూడా ఆహ్వానం పంపిస్తామని. రావడం, రాకపోవడం ఆయన వ్యక్తిగతమని ఏపి మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఏపి కేబినెట్ అమరావతి మీద నిర్ణయాలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఈ నెల 22న ఏపి నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఏపి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లను చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా, జపాన్, సింగపూర్ కు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన చంద్రబాబు.. అమరావతి శంఖుస్థాపనను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles