Haryana CM Manohar Lal Khattar Makes Controversial Comments On Beef And Dadri Incident | BJP Party Controversies

Haryana cm manohar lal khattar controversial comments on beef dadri incident

Manohar Lal Khattar news, Manohar Lal Khattar controversy, haryana cm Manohar Lal Khattar, beef controversy, beef updates, india beef controversy, dadri incident, dadri controversy, narendra modi updates

Haryana CM Manohar Lal Khattar Controversial Comments On Beef Dadri Incident : Haryana CM Manohar Lal Khattar Makes Controversial Comments On Beef And Dadri Incident. He Told Muslim Should Leave Beef.

‘గోమాంసం’పై సీఎం చేసిన సంచలన వ్యాఖ్యలు

Posted: 10/16/2015 11:09 AM IST
Haryana cm manohar lal khattar controversial comments on beef dadri incident

‘గోమాంసం’ వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలుసు! ఈ వివాదానికి పరిష్కార మార్గాన్ని కనుగొనాల్సిన రాజకీయ నాయకులు రోజుకో సంచలన వ్యాఖ్య చేస్తూ దానిపై మరింత ఆజ్యం పోస్తున్నారు. ఇప్పుడు తాజాగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఆ వివాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21తో ఏడాది పాలనను పూర్తిచేసుకోనున్న సందర్భంగా గురువారం ఓ జాతీయ దినపత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగానే ఆయన గోమాంసం, దాద్రి ఘటన సహా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఖట్టార్ తొలుత ‘గోమాంసం’ వివాదంపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ‘భారత్ లో ముస్లింలు తమ జీవనాన్ని కొనసాగించవచ్చు కానీ... ఇక్కడుండాలంటే వారు కచ్చితంగా గోమాంస భక్షణ వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోవులు అత్యంత పవిత్రమైనవి. గోమాత, భగవద్గీత, సరస్వతీదేవీలను హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆవు మాంసం తింటూ ముస్లింలు హిందువుల పవిత్రభావజాలాన్ని అవమానిస్తున్నారు' అంటూ ఆయన గోమాంస భక్షకులపై విరుచుకుపడ్డారు. ‘మనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ దానికీ ఓ హద్దు ఉంటుంది. ఇతరుల భావాలను భంగం కల్గించనంతవరకే స్వేచ్ఛకు పరిమితి ఉంటుంది' అని ఆయన అన్నారు. ఇక దాద్రి ఘటన గురించి మాట్లాడుతూ.. ఆ ఘటన అపర్థాల వల్లే సంభవిందని, ఇరు పక్షాలూ పొరపాటు చేశాయని పేర్కొన్నారు. ‘నిజానికి ఆ ఘటన జరగకుండా ఉండాల్సింది. అయితే ఈ ఘటనలో బాధిత వ్యక్తి(ఇఖ్లాక్) గోమాతను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అతని మాటలు వైరిపక్షాన్ని మరింత రెచ్చగొట్టాయి. అందుకే బీభత్సకాండ చోటుచేసుకుంది. అయినాసరే, ఒక వ్యక్తిని కొట్టి చంపడం ముమ్మాటికీ తప్పే' అని వివరించారు.

ఇదిలావుండగా.. హిందూత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ లో కీలక నేత అయిన మనోహర్ ఖట్టార్.. గత ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అధికారం చేపట్టగానే ‘ది హర్యానా గోవంశ్ సంరక్షణ’, ‘గావ్ సంవిధా’ తదితర చట్టాలను రూపొందించి హర్యానాలో గోవధను నిషేధించారు. ఆ చట్టాల ప్రకారం ఆవును చంపిన వారికి 10ఏళ్లు, ఆవు మాంసం తిన్నవారికి 5ఏళ్లు శిక్షపడే వీలుంటుంది. ఏదేమైనా.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM Manohar Lal Khattar  Beef Controversy  Dadri Incident  

Other Articles