TDP mla Revanth reddy slams KCR and Watergrid

Tdp mla revanth reddy slams kcr and watergrid

Revanth Reddy, KCR, Telangana, watergrid, RevanthReddy on KCR, KCR on watergrid

Telangana Telugu desam party working president Revanth Reddy slams KCR on watergrid project. Telangana govt plans to launch watergrid as possible as fast.

‘అది’ కేసీఆర్ కుటుంబానికి క్యాష్ లైన్

Posted: 10/14/2015 03:50 PM IST
Tdp mla revanth reddy slams kcr and watergrid

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న వాటర్ గ్రిడ్ పైప్ లైన్ పథకంపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. వాటర్ గ్రిడ్ పైప్ లైన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి క్యాష్ లైన్ అని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో పర్యటించిన టీడీపీ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లిదయాకర్ రావు, రేవంత్ రెడ్డి.. జలహారం పైలాన్ ను పరిశీలించారు. రూ.2కోట్లతో చేపట్టిన జలహారం పైలాన్ బీటలు వారిందని, నిర్మాణంలో అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మాత్రం వాటర్ గ్రిడ్ గురించి పాజిటివ్ గా ఉన్నారు. తెలంగాణలో ఏ మహిళ నీళ్ల కోసం రోడ్డెక్కర్లేదు.. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీళ్లు వస్తాయని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపడుతోంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీళ్లు అందిస్తామని.. ఒకవేళ నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఎన్నికల్లో పోటీ చెయ్యమని కేసీఆర్ మాటు చప్పారు. దాని మీద రేవంత్ రెడ్డి తనదైన కౌంటర్ వేశారు. అసలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో అసలు బాగోతానికి వాటర్ గ్రిడ్ పైలానే నిదర్శనమని అన్నారు. నాసిరకం పనులకు నిదర్శనం వాటర్ గ్రిడ్ పైలాన్ అన్నారు. 2కోట్లతో నిర్మించిన పైలాన్ పరిస్థితే ఇలా ఉంటే వేల కోట్లతో నిర్మించే పథకం పనులు ఎలా ఉంటాయో అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాను ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  KCR  Telangana  watergrid  RevanthReddy on KCR  KCR on watergrid  

Other Articles