Telangana Minister Harish Rao fired on congres leaders

Harish rao fired on congres leaders

Harish Rao, Congress, TRS, Telangana Govt, Farmers, Suicides, Congress bus yatra, harish Rao on congress

Harish rao slams congress leaders for their tour for suicide farmers. He said that congress leaders forgot farmers, when they are in power.

కాంగ్రెస్ నాయకుల మీద హరీష్ నిప్పులు

Posted: 10/14/2015 03:47 PM IST
Harish rao fired on congres leaders

నది దాటకు ముందు ఓడ మల్లన్న.. నది దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పకనే చెబుతున్నారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు చేస్తున్నదని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాల అనవసర ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏం చేసిందని... రాజశేఖర్‌రెడ్డి మొదలుకొని కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా రైతులకు మొండి చేయి చూపించారని అన్నారు. 60 ఏళ్ల పాలనలో రైతులకు చేసేందేమి లేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతునైనా పరామర్శించారా? ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విజ్ఞప్తులు ఇచ్చినా ఆపార్టీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని హరీష్ రావు మండిపడ్డారు.  ఈరోజు రైతుల మీద చూపించే ప్రేమ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు పదిశాతం చూపించినా బాగుండేదని అన్నారు. తెలంగాణలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా వారి హయంలో పూర్తిచేయలేదని... ఒక్క చెరువును పట్టించుకోలేదని.. రైతుల గురించి ఏనాడైనా కాంగ్రెస్ పట్టించుకుందా. అని హరీష్ రావు నిలదీశారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పాదయాత్రలని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harish Rao  Congress  TRS  Telangana Govt  Farmers  Suicides  Congress bus yatra  harish Rao on congress  

Other Articles