Who is the Dasara hero in telugu states CMs

Who is the dasara hero in telugu states cms

KCR, Chandrababu Naidu, telugu states, CMs, Telangana, AP, farmers, Suicides, Amaravati, Capital city Amaravati, Amaravati News, Chandrababu Naidu Tour, KCR on Hyderbad, Hyderabad, CM KCR, Chandrababu on Amaravati, Investors, Industries, Dasara

Telugu states CMs Chandraabu Naidu and KCR trying to develope their states. KCR and babu trying to attract investors from all around globe.

కేసీఆర్, చంద్రబాబులలో దసరా బుల్లోడు ఎవరంటే...?

Posted: 10/14/2015 09:50 AM IST
Who is the dasara hero in telugu states cms

తెలుగు వారి పండుగల్లో దసారి ఒకటి. ఎంతో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకొని.. దేవిని కొలిచి.. అనుగ్రహం కోసం అందరం తపిస్తుంటాం. అయితే గతానికి నేటికి తేడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. గతంలో తెలంగాణలో, ఏపిలో పరిస్థితులు సెట్ కాలేదు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సమస్య, పరిపాలనలో కొత్తగా విభజన వల్ల తలెత్తిన సమస్యలు ఉండేది. ఏపిలో రాజధాని లేకపోవడం, పరిపాలన హైదరాబాద్ కేంద్రంగా సాగడం లాంటి సమస్యలు ఉండేవి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు సమర్థవంతమైన నాయకులు సిఎంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ కే తెలంగాణ ప్రజలు సిఎంగా పట్టంకట్టార. ఏపిలో అభివృద్దిని కోరుకున్న ప్రజలు చంద్రబాబు నాయుడుకు తిరుగులేని మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అయితే ఇద్దరు తమ తమ పంధాల్లో దూసుకుపోతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం పోటీ నెలకొన్న సందర్భంగా ఏ రాష్ట్ర సిఎం ఈ దసరా బుల్లోడు అనే ప్రశ్న తలెత్తింది. దానికి సమాధానమే ఈ స్టోరీ.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు కేసీఆర్. గతంలో తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని అమలు చేస్తూ.. మరి కొన్నింటిని మాత్రం వదిలేస్తున్నారు. మైనార్టీలు, వెనుకబడిన వర్గాలకు రాయితీలు, వారికి కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం లాంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్నారు. గతంలో ఉన్న ప్రధాన సమస్య విద్యుత్ కొరతను అధిగమించారు. ఛత్తీస్ గడ్ నుండి విద్యుత్ ను కొనుగోలుచేసి.. రాష్ట్రానికి ప్రస్తుతానికి కరెంట్ కోతలు లేకుండా చేసి ప్రజల మన్ననలు పొందారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెయ్యకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికులు గుర్రుగా ఉన్నారు. టిఎస్ పిఎస్సీ ఏర్పాటు తర్వాత కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోందని నిరుద్యోగులు కాస్త గుర్రుగా ఉన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామని ముందు నుండి చెబుతున్నా.. రివ్యూ మీటింగ్ లు, సదస్సులకే పరిమితం కావడం కేసీఆర్ ప్రభుత్వానికి బ్యాడ్ ఇంప్రెషన్.

ఏపిలో పరిస్థితి వేరేలా ఉంది. అక్కడ బడ్జెట్ సమస్య. లోటు బడ్జెట్ కారణంగా రాష్ట్రానికి అన్ని ఖర్చుల్లో కోతలు విధించుకుంటోంది. కానీ ఏపి సిఎం చంద్రబాబు నాయుడు పర్యటనలకు మాత్రం బారీ ఖర్చు చేస్తుండటం విమర్శలు తెప్పించింది. ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయల వరకు చంద్రబాబు నాయుడు పర్యటనల కోసం ఖర్చైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిరా అమలులో మాత్రం అది ఇంకా సాధ్యం కాలేదు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గొప్పగా హామీ ఇచ్చినా నిరుద్యోగుల గురించి కనీసం పట్టించుకోవడం లేదు. అన్నింటికి మించి రాజధాని అమరాతి నిర్మాణం చంద్రబాబు నాయుడు ముందున్న అతి పెద్ద సమస్య. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అనుకున్న స్థాయిలో సహాయం అందకపోవడం కాస్త నిరాశ కలిగిస్తోంది. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. జగన్ ప్రజల్లోకి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుపోవడంలో బాగానే సక్సెస్ అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కామన్ గా ఉన్న ప్రస్తుత సమస్యల్లో రైతుల ఆత్మహత్యలు ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో కేవలం నెల రోజులు వ్యవధిలోనే ఎంతో మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం. తెలుగు రాష్ట్రాల సిఎంలు చెబుతున్న అభివృద్ది అంతా బూటకం అన్న విషయాన్ని రైతుల ఆత్మహత్యలు వెల్లడిస్తున్నాయి. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో ఇద్దరు సిఎంలు విఫలమవుతున్నారు. రెండు రాష్ట్రాల సిఎంలు కేవలం అభివృద్ది పధకాలు, రాజధాని వ్యవహారాల మీద మాత్రమే దృష్టిసారిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో గడ్డు కాలాన్ని ఎదర్కొన్నారు. ప్రతిపక్షాల నాయకులను ఏకంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చెయ్యాల్సి వచ్చింది.

దసరా నాటి వరకు గత సంవత్సర పాలన చూస్తే రెండు రాష్ట్రాల సిఎంలు ఎవరికి వారు మంచి పరిపాలనను అందిస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల సిఎంలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నా.. కానీ సక్సెస్ ఫుల్ గా దూసుకువెళుతున్నారు. ఏపి అమరాతి నిర్మాణం మీద పూర్తి దృష్టిసారించింది. తరతరాలకు నిలిచిపోయేలా.. తెలుగు వారి కీర్తిని అజరామరం చెయ్యడానికి చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. అదే సమయంలో దేశవిదేశాల నుండి కొత్త కొత్త కంపెనీలను ఏపికి తీసుకురాగలుతున్నారు. కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నా.. ఇంకా పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి అంతా సిద్దమైన క్రమంలో హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడుకోవడం... ఏపికి ధీటుగా పరిశ్రమలను, పెట్టుబడలను ఆకర్షించడం కేసీఆర్ ముందున్న సమస్య. మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల సిఎంలు మంచి పరిపాలను అందిస్తు.. తెలుగు వారి అభివృద్దికి కీలకంగా మారారు. అయితే అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి, దేశ విదేశాల్లో ఉన్న పెట్టుబడి దారులను ఆకర్షించడంలో, కొత్త కంపెనీలను ఏపికి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఎంతో పనిచేస్తోంది. కాబట్టి నా దృష్టిలో ఈ సారి దసరా బుల్లోడు చంద్రబాబు నాయుడు అని నా అభిప్రాయం. అలా అని కేసీఆర్ తక్కువ అని కాదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వల్ల చివరకు తెలుగు వారు సగర్వంగా తల ఎత్తుకుని తిరిగేలా చేస్తున్నారు అన్నది మాత్రం నిజం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Chandrababu Naidu  Hyderabad  Amaravati  Telugu states  Dasara  

Other Articles