Talasani on oppositions

Talasani srinivas slams oppositions parties in telangana

farmers, Talasani Sriniavs, Telanagana, Opposition parties in telangana, Suicides, Telangana, Talasani on oppositions

Talasani srinivas slams oppositions parties in telangana. Telangana minister talasani Srinivas slams opposition parties. He condemn the oppositions parties behaviour on farmers suicides.

తలసాని శ్రీనివాసా... మతిపోయిందా..?

Posted: 10/09/2015 03:48 PM IST
Talasani srinivas slams oppositions parties in telangana

ఆడలేక మద్దెల దరువు అన్నట్లు.. తెలంగాణ మంత్రులు విపక్షాల మీద విరుచుకుపడుతున్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తాం అని గొప్పలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు విపక్షాలు రైతుల రుణమాఫీ మీద నిలదీస్తే మాత్రం అలవిగాని కోరికలు అంటూ ఎద్దేవా చేశారు. తాజాగా మరో మంత్రి గారు కూడా విపక్షాలను నిందిస్తున్నారు. అసలు రైతుల విషయంలో విపక్షాలే నాటకాలుడుతున్నాయని తెగ మండిపడుతున్నారు. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాల మీద కారాలు మిరియాలు నూరారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న పార్టీలు రైతులకు చేసిందేమి లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని ఉద్ఘాటించారు.

రైతులకు చెప్పినట్లుగానే  17 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పామని... ఇప్పటికే రెండు విడతలుగా 8 వేల 500 కోట్లు చెల్లించామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ వివరించారు. మిగిలిన  8 వేల 500 కోట్లను వన్‌టైం సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. విపక్షాలు రైతుల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. సమయానికి విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదు. కానీ తమ ప్రభుత్వం సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేశామని తెలిపారు. టీడీపీ నేతలు ఇక్కడ నిరసనలు చేయడం ఆపాలి. ఏపీలో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయమని చంద్రబాబుకు చెప్పండి అని సూచించారు. రైతులకు కరెంట్, నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.  మొత్తానికి తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లని నమ్మే తలసాని శ్రీనివాస్ రావు కూడా విపక్షాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం తరఫున వంతపాడటం ఏంటని కొంత మంది విశ్లేషకులు మండిపడుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles