two festivals in one day

Ap people celebrating two festivals in one day

AP, Amaravati, Dasara, Festivals, Chandrababu, AP govt, Celebrations, Amaravati celebrations, Amaravati inaugration

AP people celebrating two festivals in one day. AP govt grandly celebrating the dasara and Amaravati inaugration function. AP people have to celebrate one two festivals.

ఆంధ్రులకు ఒకే రోజు రెండు పండగలు..

Posted: 10/09/2015 03:24 PM IST
Ap people celebrating two festivals in one day

సంవత్సరంలో ఒకే రోజు రెండు పండుగలు రావడం చాలా అరుదు. కానీ ఏపి ప్రజలకు మాత్రం ఈ దసరా రోజే మర పండగ కూడా ఉంది. ఎంతో అంగరంగ వైభవంగా దసరా పండగతో పాటు ఆ పండగను కూడా నిర్వహించడానికి ప్రభుత్వ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పండగంటే ప్రజలు అందరూ కలిసి ఆనందంగా చేసుకునే వేడుక. ఏపి ప్రజల చిరకాల స్వప్నం నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపకు ఏపి ప్రభుత్వం చరిత్రలోనిలిచిపోయే స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ముహుర్తం సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ శతాబ్ధంలోనే మొదటి రాజధాని నిర్మాణం కావడంతో నభూతో నభవిష్యతి అన్న రీతిలో దీన్ని నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. శంకుస్థాపన జరిగే ఉద్దండరాయుని పాలెంలో హడావుడి కనిపిస్తోంది

అక్టోబర్‌ 22న ఏపీలో రెండు పండగలు జరగనున్నాయి. ఒకటి విజయదశమి, రెండవది కొత్త రాజధానికి అంకురార్పణ... గుంటూరు జిల్లాలోని తుళ్లూరుకు సమీపంలోని ఉద్దండ రాయుని పాలెంలో 22న కొత్త రాజధానికి శంకుస్థాపన జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి...250 ఎకరాలను చదును చేస్తున్నారు. పొక్లైనర్లు, ట్రాక్టర్లు, కూలీలతో జోరుగా పని సాగుతోంది...చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles