High court judgement on agrigold

High court judgement on agrigold

Agri gold, AP, Telangana, Agrigold agents, Agrigold customers, High court

High court judgement on agrigold. High court announce the judgement on Agrigold. Agrigold cheated many customers in the seven states.

అగ్రిగోల్డ్ మీద హైకోర్ట్ తీర్పు అదే..

Posted: 10/09/2015 03:14 PM IST
High court judgement on agrigold

అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసానికి తెలుగు రాష్ట్రాల్లో బాధితులు తల్లడిల్లారు. ఎంతో కష్టపడి పోగేసిన డబ్బులు మునిగిపోయాయా అంటూ ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు. అయితే తాజాగా అగ్రిగోల్డ్ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాలు.. బాధితులకు చెల్లింపులు కమిటీ పర్యవేక్షణలో జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తొలి విడతలో 14, రెండో విడతలో ఆరు ఆస్తులను విక్రయించాలని కమిటీకి హైకోర్టు ఆదేశించింది. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్ పేరుతో బ్యాంక్ ఖాతా తెరవాలని కమిటీకి తెలిపింది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ త్రిసభ్య కమిటీకి పూర్తిగా సహకరించాలని కోర్టు వ్యాఖ్యానించింది.

ఏడు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి మోసం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కోర్టు విచారణ జరుపుతోంది. డిపాజిటర్లకు రెండు నెలల్లో న్యాయం జరిగేలా చూస్తామని గతంలో కోర్టు తెలిపింది. ఇక బెంగళూరు, విజయవాడతో పాటు పలు చోట్ల తమకున్న ఆస్తుల వివరాలను అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. కాగా ఆస్తుల అమ్మకాలపై విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. ఖాళీగా ఉన్న భూములను.. అలాగే అమ్మాలా, లేక ఫ్లాట్లుగా చేసి అమ్మాలా దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆస్తుల అమ్మకాలపై విధివిధానాలు, రిటైర్డ్ జడ్జి పేరును కోర్టు సోమవారం ప్రకటించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Agri gold  AP  Telangana  Agrigold agents  Agrigold customers  High court  

Other Articles