NRI uses WhatsApp to divorce His wife of 4 weeks | Whatsapp Divorce | Kerala Girl WhatsApp Divorce

Nri uses whatsapp to divorce his wife of 4 weeks by sending talaq

Kerala Girl WhatsApp Divorce, whatsapp divorce case, whatsapp divorce, nri divorce wife whatsapp, whatsapp controversies, dubai person gave divorce through whatsapp

NRI uses WhatsApp to divorce His wife of 4 weeks By Sending Talaq : A 21-year-old woman from Kerala has been divorced by her husband over WhatsApp after just four weeks of marriage

పెళ్లయిన పదిరోజులకే వాట్సాప్ లో ‘తలాఖ్’

Posted: 10/08/2015 12:30 PM IST
Nri uses whatsapp to divorce his wife of 4 weeks by sending talaq

‘పెళ్లి’.. ఈ అన్యోన్యమైన బంధం గురించి వివరించడానికి మాటలు సరిపోవు. సమస్తలోకంలో ఎంతో మధురమైన, సంస్కారవంతమైన ఈ బంధాన్ని ప్రస్తుత రోజుల్లో అభాసుపాలు చేస్తున్నారు. ఇందుకుతోడుగా నేటి సాంకేతిక పరిజ్ఞానం ప్రజలపై ప్రభావం చూపడంతో.. వాటి సహాయంగా తమ బంధాల్ని తామే స్వయంగా ఛిద్రం చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చోటుకున్నాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది కూడా! ఎందరో వ్యక్తుల సమక్షంలో దేవుడి సాక్షిగా ఈ జన్మకి ఒకరినొకరు వదలకుండా తోడుగా వుంటామని మాటిచ్చే జంటలు.. కోరికలు తీరిన కొద్దిరోజులకే విడిపోతున్నారు. ముఖ్యంగా మగాళ్లు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకునేంతవరకు మాయమాటలు చెప్పడం.. పెళ్లయిన తర్వాత కోరికలు తీర్చుకున్నాక ఆ వెంటనే విడాకులు ఇచ్చేయడం లాంటి దుర్బుద్ధి గల మగాళ్లు ఇప్పటికీ సమాజంలో వున్నారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా జరిగిన సంఘటననే ఉదాహరణగా తీసుకోవచ్చు.

పెళ్లయిన పదిరోజులకే వాట్సాప్‌లో నవవధువుకు ‘తలాఖ్... తలాఖ్... తలాఖ్’ అంటూ మెసేజ్ పంపాడో ఎన్‌ఆర్‌ఐ. ఇంతటితో నీకూ నాకూ చెల్లు అన్నాడు. అవాక్కయిన వధువు కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలప్పుజ జిల్లాలోని చెర్తాలాకు చెందిన 21 ఏళ్ల యువతి బీడీఎస్ చదువుతోంది. బెర్ దుబాయ్‌లో ఉద్యోగం చేసే వ్యక్తితో ఆమెకు గత నెలలో పెళ్లయింది. పదిరోజులు నవదంపతులు ఆనందంగా గడిపారు. ఇంతలోనే ఆ కొత్త పెళ్లికొడుకు ఉద్యోగానికంటూ దుబాయ్‌కి బయలుదేరాడు. అంతే! అటు వెళ్ళినోడు అటే వెళ్లిపోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. భార్య ఎన్నోసార్లు ఫోన్ చేసింది. వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పెట్టింది. చివరికి ఒకరోజు అతని నుంచి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ‘నువ్వెందుకు అదేపనిగా ఫోన్లు చేస్తున్నావు? నువ్వంటే ఇష్టం లేదు. నాకోసం వేచిచూడొద్దు. ఆపిల్ పండును ఇష్టపడ్డామనుకో... అంతమాత్రాన ప్రతిరోజూ దాన్నే తినలేం కదా. ఇతర ఫలాలనూ తినాలి కదా. తలాఖ్... తలాఖ్.. తలాఖ్..’ అంటూ మెసేజ్ పెట్టాడు.

అతగాడి మెస్సేజ్ తో ఒక్కసారిగా షాక్ అయిన బాధితురాలు.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు మహిళా కమిషన్ సభ్యురాలు ప్రమీల తెలిపారు. అతని ఆచూకీ కనిపెట్టమని ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖను కోరామన్నారు. ఇలాంటి తలాఖ్‌లు చెల్లవని థంగల్ అనే ఇస్లామిక్ పండితుడు చెప్పాడన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala Girl WhatsApp Divorce  whatsapp divorce case  

Other Articles