Jammu and Kashmir lawmaker thrashed by BJP members day after beef party

Jammu and kashmir lawmaker thrashed

Jammu and Kashmir, Jammu and Kashmir MLA Beaten, Jammu and Kashmir MLA Beaten Beef Party, Jammu and Kashmir Beef PartyBJP Members Thrash, J&K MLABJP Members Thrash, J&K MLA Beef Party, J&K Assembly, Jammu and Kashmir Assembly

In the Jammu and Kashmir assembly this morning, several BJP lawmakers beat up an Independent MLA Sheikh Abdul Rashid, who had hosted a beef party on Wednesday. Chief Minister Mufti Mohammad Sayeed has condemned the assault saying, "You cannot manhandle an MLA.

పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యేను చితకొట్టారు

Posted: 10/08/2015 01:04 PM IST
Jammu and kashmir lawmaker thrashed

అవును.. ఎమ్మెల్యే మీద దాడి చేశారు.. అది కూడా అసెంబ్లీ సామవేశాల్లో. జమ్మ కాశ్మీర్ లో నడుస్తున్న బీఫ్ బ్యాన్ వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది. రాష్ట్రంలో బీఫ్ నిషేదం మీద ప్రతిపక్ష పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో అడ్డుకుంటూ నినాదాలు చేస్తూ.. సభను సజావుగా నడవకుండా అడ్డుకుంటున్నాయి. అయితే తాజాగా మరో ఎమ్మెల్యే మీద ఏకంగా దాడికి దిగడం వార్తల్లో నిలుస్తోంది. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి ఘటన జరగడం మీద స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యే మీద దాడి చెయ్యాల్పినంత అవసరం ఏం వచ్చింది అనుకుంటున్నారా...? అయితే స్టోరీ చదవండి.

జమ్ము కాశ్మీర్ ఇండిపెండెంట్ రషీద్ ఎమ్మెల్యేలకు బీఫ్ పార్టీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఫ్ వాడకం మీద నిషేదం ఉన్నా కానీ పార్టీ ఇవ్వడంతో వివాదం మొదలైంది. అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి నాయకులు రషీద్ ఇచ్చిన బీప్ పార్టీ మీద మాటల తూటాలు పేల్చారు. అయితే మాటలు హద్దుల దాటడంతో చివరకు చేతల దాకా వచ్చింది. కొంత మంది ఎమ్మెల్యేలు రషీద్ ను ముట్టడించి దాడికి పాల్పడ్డారు. దాంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు రషీదును అక్కడి నుండి పంపించేశారు. బిజెపి ఎమ్మెల్యేలు ఇలా ఎమ్మెల్యే మీద దాడికి దిగడం మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జమ్ము కాశ్మీర్  అసెంబ్లీ అంటేనే రోజుకో మలుపు తిరిగే స్టోరీ లాంటిది అనే ఓ పేరుంది. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ చరిత్రలో ఎమ్మెల్యే మీద దాడి చీకటి కోణానికి నిదర్శనంగా నిలుస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles