KCR nose | Nagam Janardhan Reddy

He will put kcr nose to the ground

KCR, Nagam Janardhan Reddy, KCRs nose, Telangana, Farmers Suicides

Nagam Janardhan Reddy will put Telangana cm KCRs nose to the Ground. Nagam slams KCR for his govts anti farmers policies.

కేసీఆర్ ముక్కు నేలకు రాసేది ‘అతనే’

Posted: 10/08/2015 10:15 AM IST
He will put kcr nose to the ground

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో అప్పుడప్పుడు కొత్త పదాలను వాడుతుంటారు. అంటే ఆ పదాలు దాదాపు కేసీఆర్ కు సొంతం అన్నట్లు. ఉద్యమ సమయంలో చాలా సార్లు కేసీఆర్ వాడిన ఓ డైలాగ్ బాగా ఫేమస్ అలా కాకపోతే నా ముక్కు నేలకు రాస్తా అని. అయితే ఇప్పటి దాకా అయితే ఆ అవసరం, సందర్భం రాలేదు కానీ ఒక నాయకుడు మాత్రం కేసీఆర్ ముక్కు నేలకు రాసేది తానేనని అంటున్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అంతెత్తుతన మండిపడుతున్నారు. కొత్తగా కేసీఆర్ హఠావో.... కిసాన్ బచావో అని నినాదం కూడా ఇస్తున్నారు. మరి ఆ నేత ఎవరో తెలుసా..? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగి తర్వాత ప్రాభవం కోల్పోయిన ఆ నేత ఇంకా ఏమన్నారంటే...

నేను ఆసెంబ్లీలో ఉండుంటే సీఎం కేసీఆర్‌ను ముక్కు నేలకు రాయించేవాడినని నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. దసరా వరకు చూస్తామని.. ఆ తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బచావో తెలంగాణ మిషన్‌ ఆధ్వర్యంలో ‘కేసీఆర్‌ హఠావో... కిసాన్‌, తెలంగాణ బచావో’ పేరిట ఉద్యమం చేస్తామని వెల్లడించారు. ఈ నెల 10న ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.రైతు ఆత్మహత్యలపై, శాసనసభ జరుగుతున్న తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు లేకుండా సభ ఏమిటని ఆయన ప్రశ్నించారు.హామీలు ఇచ్చినప్పుడు అవి అలివికానివని గుర్తు లేదా అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Nagam Janardhan Reddy  KCRs nose  Telangana  Farmers Suicides  

Other Articles