Arvind Kejriwal changes stand, says Nitish good person, people should vote him as CM

Now arvind kejriwal says i fully support nitish kumar

arvind kejriwal on bihar elections, arvind kejriwal says nitish good person, arvind kejriwal asks people to vote nitish, arvind kejriwal on nitish cm, arvind kejriwal, cms conclave, mamata banerjee, kejriwal mamata, mamata kejriwal, tweet, sharp, Nitish Kumar, Bihar, Arvind Kejriwal, bihar assembly elections 2015

Aam Aadmi Party Chief Arvind Kejriwal on Thursday morning made a sharp change in his statement, this time asking people to vote for Nitish Kumar as Chief Minister.

నితీష్ మంచి వ్యక్తి.. నా సంపూర్ణ మద్దతు ఆయనకే..! ‘కెజ్రీ’ ట్విట్

Posted: 10/01/2015 03:04 PM IST
Now arvind kejriwal says i fully support nitish kumar

బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో బిజేపీకి కొంత ఇబ్బంది పరిణామాలనే తీసుకువచ్చేలా వున్నాయి. ఇప్పటికీ సోంత పార్టీపై విమర్శలు, అరోపణలు చేస్తున్న పార్లమెంటు సభ్యలు సంఖ్య పెరగడంతో పాటు.. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు మద్దత్తు కూడా పెరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో బిజేపి ఎంపీ షాట్ గన్ శతృఘ్న సిన్హా బీహార్ ముఖ్యమంత్రి.. స్థానిక ప్రజలకు ఆయన తండ్రి లాంటి వాడని, ఆయన తప్ప మిగిని రాజకీయ నేతలు ఎవరు అధికార పగ్గాలు చేపట్టినా.. అది అధికారం కోసమే తప్ప.. మరోదానికి కాదని అన్నారు. ఆ తరువాత తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా నితిష్ కుమార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

నితీశ్ కు ఓటు వేయాలని బిహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పలు జాతీయ, రాష్ట్రీయ మీడియా సంస్థలు తన ప్రకటన వక్రీకరించాయిన వివరణ ఇస్తూనే.. ఆయన తన సంపూర్ణ మద్దతు జేడీయు - ఆర్జేడీ పార్టీలకు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ మంచి మనిషి. ఆయనకే ఓటు వేయాలని.. మరో మారు ఆయననే బిహార్ ప్రజలు ముఖ్యమంత్రిని చేయలాని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోదని, ఎన్నికల ప్రచారానికి వెళ్లబోనని కేజ్రీవాల్ చెప్పినట్టు మీడియాలో బుధవారం వార్తలు వచ్చాయి. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో'ఆప్'కు జేడీ(యూ) మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేసిన కేజ్రీవాల్ కు జేడీ(యూ) అండగా నిలిచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tweet  sharp  Nitish Kumar  Bihar  Arvind Kejriwal  bihar elections  

Other Articles