Ilayathalapathy Vijay Latest Movie Puli Release Stopped Due To It Raids And Financial Problems | Kollywood Gossips

Puli movie release stopped due to it raids and financial problems

puli movie news, puli movie release, puli movie udpates, puli release cancelled, puli release stopped, puli release controversy, hero vijay it raids, puli financial problems, puli latest controversies

Puli Movie Release Stopped Due To It Raids And Financial Problems : Ilayathalapathy Vijay Latest Movie Puli Release Stopped Due To It Raids And Financial Problems

థియేటర్లలో ఇంకా గాండ్రించని ‘పులి’

Posted: 10/01/2015 10:37 AM IST
Puli movie release stopped due to it raids and financial problems

ఇళయథలపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘పులి’కి విడుదల కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ సినిమా గురువారం విడుదల కావాల్సి వున్నప్పటికీ.. ఇంకా రిలీజ్ కాలేదు. అటు.. తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్ల విడుదల కూడా అనుమానంలోనే పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి పులి హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతల అందరి ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడం వల్లే విడుదల ఆగిపోయిందా అని కోలీవుడ్ టాక్ కొనసాగుతోంది. మరోవైపు.. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా వున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఆగిపోయిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఫైనాన్షియర్లకు డబ్బులు అందినప్పుడే ఈ చిత్రం విడుదల అవుతుందని అంటున్నారు. ఈ సమస్య సమసినప్పుడు రిలీజ్ వుంటుందని, లేకపోతే ఈ చిత్రం కూడా ‘వాయిదాల పర్వం’ బారిన పడాల్సి వస్తుందేమోనని అనుమానిస్తున్నారు.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలను తెల్లవారుజామున 4 గంటలకు, 5 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు. కానీ ‘పులి’ విషయంలో గురువారం ఇవేవీ ప్రదర్శించలేదు. దీంతో.. అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధర్మపురి, సేలంలో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళన చేశారు. మదురైలో బస్సులను ధ్వంసం చేశారు. ప్రీమియర్ షోలను ఎందుకు ఆపేయమన్నారో తమకు కూడా తెలియట్లేదని, సినిమా విడుదల విషయంలో క్యూబ్ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నామని ఓ థియేటర్ యజమాని తెలిపారు. సినిమాను డిజిటల్గా స్ట్రీమింగ్ చేసే క్యూబ్ సంస్థకు పులి నిర్మాతలు ఇంకా కొంత సొమ్ము చెల్లించలేదని, ఆ విషయం సెటిల్ కాగానే విడుదలకు అనుమతి రావొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఐటీ దాడుల కారణంగా ఎగ్జిబిటర్లకు చెల్లింపులు చేయడానికి ఆదాయపన్ను అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉందని, అందువల్లే సినిమా ఆగిందని కూడా చెబుతున్నారు.

ఉదయం 8 గంటలకు, 9 గంటలకు ప్రదర్శించాల్సిన షోలను కూడా థియేటర్లు రద్దు చేసుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత అనుమతి రావచ్చని, అయితే అది కూడా కచ్చితంగా వస్తుందని చెప్పలేమని అంటున్నారు. అమెరికా కెనడాలలో కూడా ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అట్మస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ తెలిపింది. దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని వున్నాయి. ఇప్పటిదాకా ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిన ఈ చిత్రానికి విడుదల కష్టాలు రావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోందని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles