Rajnath Singh snubs RK Singh after party MP alleges corruption in Bihar ticket distribution

Bjp s bihar tickets being sold to criminals alleges party s rk singh

rajnath singh, rajnath bjp tickets, rajnath bihar elections, rk singh bjp tickets, rk singh bihar elections, bihar elections, Bihar elections,BJP Bihar,Horse trading,RK Singh, bihar polls, bihar news,

Rajnath Singh was asked to comment on the remarks of former bureaucrat and Ara MP RK Singh’s allegation of exchange of money in ticket distribution for the Bihar assembly election by some state party leaders.

క్రిమినల్స్, సంపన్నులకు టిక్కెట్లా.? మా ఎంపీ చెప్పింది అసత్యం..

Posted: 09/26/2015 08:08 PM IST
Bjp s bihar tickets being sold to criminals alleges party s rk singh

బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓ వైపు రాజకీయాలు వేడెక్కుతుండగా, తమ పార్టీ డబ్బున్న మారాజులకు టిక్కెట్లను అమ్ముకుంటుందని బీజేపీ నేతలే సొంత పార్టీ అగడాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కేడర్ క్రిమినల్స్‌కు పార్టీ టికెట్లు కట్టబెడుతోందని బిజేపి పార్టీ ఎంపీ ఆర్కే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించి నేరస్తులకు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీకి, ఆర్జెడీకి తేడా ఏంటని ఆయన ప్రశ్నించారు.

అంతేకాదు బీజేపీ బీహార్ కేడర్ పార్టీ టికెట్లను కూడా అమ్ముకుంటోందని ఆర్కే సింగ్ ఆరోపించారు. క్రిమినల్స్‌కు టికెట్లు కేటాయించి ఆ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కోల్పోతోందని ఆయన విమర్శించారు. టికెట్ల విషయంలో పార్టీ కార్యకర్తలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంపీ ఆర్కే సింగ్ ఆరోపణలను ఖండించారు. టికెట్ల కేటాయింపు సజావుగానే జరుగుతోందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

కాగా, ఆర్కే సింగ్ సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఖండించారు. ఎంపీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని లక్నోలో శనివారం జరిగిన  ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులు న్యాయబద్ధంగా జరిగాయన్నారు. ఓ విలేకరి ప్రశ్నకు రాజ్నాథ్ బదులిస్తూ.. ప్రజల మద్ధతుతో బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ మెజారిటీ విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ చేసినవి అసత్య ఆరోపణలంటూ ఆయన మండిపడ్దారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajnath singh  Bihar elections  BJP Bihar  Horse trading  RK Singh  

Other Articles