Sanjay Dutt never applied for pardon To Maharashtra Governor says lawyer | 1993 Mumbai Bomb Blast Case

Sanjay dutt clarification on pardon plea to maharashtra governor

sanjay dutt, sanjay dutt pardon petition, 1993 mumbai bomb blast, sanjay dutt updates, sanjay dutt controversy, sanjay dutt latest updates, sanjay dutt bomb blast case, sanjay bomb blast case

Sanjay Dutt Clarification On Pardon Plea To Maharashtra Governor : Following Maharashtra Governor Ch Vidyasagar Rao’s rejection of a plea to waive the remaining jail term of actor Sanjay Dutt, convicted in the 1993 Mumbai serial blasts case, the actor’s lawyer said on Friday that he did not file the petition.

నేనసలు ఆయన్ను క్షమాభిక్ష కోరనేలేదు : సంజయ్

Posted: 09/26/2015 12:38 PM IST
Sanjay dutt clarification on pardon plea to maharashtra governor

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1993 ముంబై పేలుళ్ల కేసులో అక్రమాయుధాల చట్టం కింద జైలు జీవితం అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి సంబంధించి ‘క్షమాభిక్ష’ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆయన.. తనకు క్షమాభిక్ష పెట్టాలని తానెప్పుడూ మహారాష్ట్ర గవర్నర్‌ని కానీ ఇంకెవరిని కానీ కోరలేదని అన్నారు. అయితే.. ఇతనికి క్షమాభిక్ష ఇచ్చి.. శిక్షాకాలాన్ని తగ్గించాలంటూ రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ లేఖరాశారు. అంతే! అప్పటినుంచి అది అలాగే వుండిపోయింది. కానీ.. ఎంతో ఆలస్యంగా ఇప్పుడు దానిని మహారాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది. ఆ పిటిషన్ ను పరిశీలించిన గవర్నర్‌ విద్యాసాగర్‌రావు.. సంజయ్ దత్ క్షమాభిక్షను తిరస్కరించారు.

ఈ విషయమై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ దాఖలుచేసిన దరఖాస్తుకు ప్రతికూలంగా రాష్ట్ర హోంశాఖ నివేదిక సమర్పించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశ అత్యున్నత న్యాయస్థానం శిక్ష విధించినందున సంజయ్‌దత్‌కు క్షమాభిక్ష ప్రసాదించడం తప్పుడు సంకేతాలనిస్తుందని గవర్నర్‌కు రాష్ట్ర హోంశాఖ పంపిన నివేదికలో తెలిపింది. దీనిపై తన స్పందనేంటి అని మీడియా ప్రతినిధులు సంజయ్ ను ప్రశ్నించగా.. అసలు తాను క్షమాభిక్ష కావాలని కోరలేదని స్పష్టం చేశారు. అలాగే.. అతని తరఫు న్యాయవాదులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అసలు సంజయ్‌దత్‌, ఆయన కుటుంబసభ్యులు ఎవరూ అలాంటి పిటీషన్‌ పెట్టుకోలేదని సంజయ్‌ తరపు న్యాయవాదులు హితేష్‌ జైన్‌, సుభాష్‌ జాదవ్‌లు స్పష్టంచేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjay dutt  maharashtra governor  1993 mumbai bomb blast  

Other Articles